రంజీట్రోఫీలో తెలుగు రాష్ట్ర్రాల జట్ల బోణీ
కేరళపై హైదరాబాద్, రాజస్థాన్ పై ఆంధ్ర గెలుపు దేశవాళీ క్రికెట్ రంజీట్రోఫీ 2020 సీజన్లో తెలుగు రాష్ట్ర్రాల జట్లు హైదరాబాద్, ఆంధ్ర జట్లు తొలివిజయాలు నమోదు చేశాయి. సీజన్ ప్రారంభరౌండ్ల మ్యాచ్ ల్లో పరాజయాలు పొందిన ఆంధ్ర, హైదరాబాద్ జట్లు నాలుగోరౌండ్ మ్యాచ్ ల విజయాలతో పుంజుకోగలిగాయి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కేరళతో ముగిసిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల విజయం సొంతం చేసుకొంది. విజయానికి అవసరమైన 155 పరుగుల లక్ష్యాన్ని […]
- కేరళపై హైదరాబాద్, రాజస్థాన్ పై ఆంధ్ర గెలుపు
దేశవాళీ క్రికెట్ రంజీట్రోఫీ 2020 సీజన్లో తెలుగు రాష్ట్ర్రాల జట్లు హైదరాబాద్, ఆంధ్ర జట్లు తొలివిజయాలు నమోదు చేశాయి. సీజన్ ప్రారంభరౌండ్ల మ్యాచ్ ల్లో పరాజయాలు పొందిన ఆంధ్ర, హైదరాబాద్ జట్లు నాలుగోరౌండ్ మ్యాచ్ ల విజయాలతో పుంజుకోగలిగాయి.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కేరళతో ముగిసిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల విజయం సొంతం చేసుకొంది.
విజయానికి అవసరమైన 155 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల నష్టానికి చేదించి సీజన్ తొలివిజయాన్ని నమోదు చేసింది. మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో హైదరాబాద్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం.
ఆంధ్ర అలవోక గెలుపు..
జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముగిసిన మరో మ్యాచ్ లో రాజస్థాన్ తన ముందు ఉంచిన 152 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర అలవోకగా అధిగమించింది.
కెప్టెన్ హనుమ విహారీ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ భరత్ హాప్ సెంచరీలతో తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు. గత నాలుగురౌండ్లలో ఆంధ్రకు ఇది తొలివిజయం కాగా…రాజస్థాన్ కు వరుసగా మూడో ఓటమి కావడం విశేషం.
దేశంలోని మొత్తం 28 రాష్ట్ర్రాల జట్లు మూడు గ్రూపులుగా రంజీ రౌండ్ రాబిన్ లీగ్ లో తలపడుతున్నాయి.