Telugu Global
NEWS

కేబినెట్ లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?

మున్సిపల్ ఎన్నికలతో మంత్రులకు కేసీఆర్ పరీక్ష పెట్టారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే పోస్టులు ఊస్ట్ అవుతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఇప్పుడు భయం నెలకొందట.. తమ ప్రాంతాల్లో పార్టీ ఓడిపోతే తమ పదవులు పోతాయనే భయం ఆయా మంత్రులను వెంటాడుతోందట. మున్సిపల్ సన్నాహక సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ మనం ఖచ్చితంగా గెలవాలని.. గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. లేకపోతే మంత్రుల పోస్టులు ఊడిపోతాయని చెప్పారు. నిజానికి కేసీఆర్ మొన్నటి మంత్రివర్గ విస్తరణలోనే ఐదుగురు మంత్రులకు […]

కేబినెట్ లో భారీ మార్పులకు కేసీఆర్ ప్లాన్?
X

మున్సిపల్ ఎన్నికలతో మంత్రులకు కేసీఆర్ పరీక్ష పెట్టారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే పోస్టులు ఊస్ట్ అవుతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఇప్పుడు భయం నెలకొందట.. తమ ప్రాంతాల్లో పార్టీ ఓడిపోతే తమ పదవులు పోతాయనే భయం ఆయా మంత్రులను వెంటాడుతోందట.

మున్సిపల్ సన్నాహక సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ మనం ఖచ్చితంగా గెలవాలని.. గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. లేకపోతే మంత్రుల పోస్టులు ఊడిపోతాయని చెప్పారు. నిజానికి కేసీఆర్ మొన్నటి మంత్రివర్గ విస్తరణలోనే ఐదుగురు మంత్రులకు స్వస్తి పలికి కొత్త వారిని తీసుకుంటారని ప్రచారం జరిగింది. మంత్రి మల్లారెడ్డి, ఈటెల సహా మరో ముగ్గురిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు లేనిపోని వివాదాలకు పోకుండా కేసీఆర్ సైలెంట్ అయ్యారు.

అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయబోతున్నాడని తెలిసింది. ఈమేరకు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఫలితాలు వచ్చాక ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయబోతున్నాడట.. కేటీఆర్ కు అనుకూలమైన వారిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నాడట.. సో మున్సిపల్ పరీక్ష పేరుతో విఫలమైన వారిని సాగనంపడం.. పనిచేయని మంత్రులను వైదొలగించుకోవడానికి కేసీఆర్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

First Published:  7 Jan 2020 5:14 AM IST
Next Story