బాబు బ్యాచ్‌లో చీలిక.... తలోదారి వైపు పరుగులు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు బ్యాచ్‌లో చీలిక వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వెంట ఉన్న బ్యాచ్ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. తలో దారి వైపు పరుగులు పెడుతున్నాయి. ఆ రెండు వర్గాలే ఒకటి బాబు బినామీ బ్యాచ్. రెండోది బాబు భజన బ్యాచ్. అధికారం కోల్పోగానే బాబు బినామీ బ్యాచ్ ముందు సూట్‌కేసులు సర్దుకున్నాయి. నలుగురు కలిసి బీజేపీలో చేరారు. తమ కాంట్రాక్ట్‌లు, కంపెనీల పనుల్లో బిజీ అయిపోయారు. మరికొంత మంది కూడా ఇప్పుడు గప్ […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు బ్యాచ్‌లో చీలిక వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వెంట ఉన్న బ్యాచ్ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. తలో దారి వైపు పరుగులు పెడుతున్నాయి. ఆ రెండు వర్గాలే ఒకటి బాబు బినామీ బ్యాచ్. రెండోది బాబు భజన బ్యాచ్.
అధికారం కోల్పోగానే బాబు బినామీ బ్యాచ్ ముందు సూట్‌కేసులు సర్దుకున్నాయి. నలుగురు కలిసి బీజేపీలో చేరారు. తమ కాంట్రాక్ట్‌లు, కంపెనీల పనుల్లో బిజీ అయిపోయారు. మరికొంత మంది కూడా ఇప్పుడు గప్ చుప్ అయ్యారు. తమ తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. టీడీపీ రాజకీయాలను వదిలేశారు. సైలెంట్‌గా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ఒకాయన తన కార్పొరేట్ కాలేజీల పనుల్లో బిజీ అయిపోయాడు. మిగతా బ్యాచ్ తమ రియల్ వ్యాపారాలు… ఇతర వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు.
అయితే అమరావతి ఎపిసోడ్‌లో మాత్రం బినామీ బ్యాచ్ తెర వెనుకే ఉంటుంది. తెర ముందుకు వస్తే తమకు బ్యాండ్ పడుతుందనేది వీరి భయం. అందుకే కోట్లలో నష్టం వస్తుందని తెలిసినా సైలెంట్ గా ఉన్నారట.
ఇటు అమరావతిలో మాత్రం ఇప్పుడు బాబు భజన బ్యాచ్‌దే హడావుడి. ఓవైపు దీక్షలు..మరోవైపు ప్రెస్‌మీట్‌లు పెట్టి తమ భజనను కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భజనచేసి నాలుగు రాళ్లు వెనకేసుకున్న ఈ బ్యాచ్ ఇప్పుడు కూడా అదే భజన కంటిన్యూ చేస్తోంది. విజయవాడలో ఓ మాజీ ఎమ్మెల్యే, ఇంకో మాజీ ఎమ్మెల్సీతో పాటు ఇతర నేతలు ఇదే పనిలో ఉన్నారు.
మొత్తానికి ఇప్పుడు టీడీపీ ఆఫీసులో అధికారంలో ఉన్నప్పుడు భారీగా సంపాదించుకున్న బినామీ బ్యాచ్ మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇటు వైపు అసలు రావడం లేదు. మంచిగా వేరే పార్టీలో సెటిల్ అయ్యారు అంటూ తమ్ముళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇటు భజన బ్యాచ్ తమ లెవల్లో చిడతలతో వ్యవహారాలు నడిపిస్తుందని వాపోతున్నారు. ఎటొచ్చి పార్టీ కోసం కష్టపడినవారికే అవకాశం లేకుండా పోయిందని నిట్టూరుస్తున్నారు.