బన్నీ బావోద్వేగం... అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు?
అల వైకుంఠపురములో…మ్యూజికల్ నైట్ గ్రాండ్ గా జరిగింది. అతిరథ మహారథులు రాకపోయినా… తానొక్కడినే అన్నట్టుగా సంగీతోత్సవాన్ని నిర్వహించేలా చేశాడు బన్నీ. వచ్చిన వాళ్లందరూ స్పీచ్‌లు ఇరగదీసేశారు. షరా మామూలుగా అంతా బన్నీనే మూల స్థంబం అంటూ పొగిడేశారు. ఈ తతంగమంతా అయ్యాక చివర్లో అల్లుఅర్జున్ స్పీచ్ స్టార్ట్ అయింది. అందరూ అనుకున్నట్లుగా మామూలుగా జరగలేదు ఆయన స్పీచ్…నాన్నకు ప్రేమతో అంటూ కన్నీళ్ల వర్షం కురిపించాడు. ఎన్నడూ లేని విధంగా తానింకా నాన్న చాటు బిడ్డనే అంటూ చెప్పుకొచ్చాడు. […]
అల వైకుంఠపురములో…మ్యూజికల్ నైట్ గ్రాండ్ గా జరిగింది. అతిరథ మహారథులు రాకపోయినా… తానొక్కడినే అన్నట్టుగా సంగీతోత్సవాన్ని నిర్వహించేలా చేశాడు బన్నీ. వచ్చిన వాళ్లందరూ స్పీచ్‌లు ఇరగదీసేశారు. షరా మామూలుగా అంతా బన్నీనే మూల స్థంబం అంటూ పొగిడేశారు.
ఈ తతంగమంతా అయ్యాక చివర్లో అల్లుఅర్జున్ స్పీచ్ స్టార్ట్ అయింది. అందరూ అనుకున్నట్లుగా మామూలుగా జరగలేదు ఆయన స్పీచ్…నాన్నకు ప్రేమతో అంటూ కన్నీళ్ల వర్షం కురిపించాడు. ఎన్నడూ లేని విధంగా తానింకా నాన్న చాటు బిడ్డనే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తాను తండ్రి అయితే కానీ తెలియలేదంటూ సెంటిమెంట్ కురిపించాడు….కన్నీళ్లతో కన్నవారికి థ్యాంక్యు చెప్పిన అల్లు అర్జున్… ఓ కాంట్రవర్సీకి కూడా కొబ్బరికాయ కొట్టేశాడు.
ఇప్పటి వరకు తాను 20 సినిమాలు చేశానని..వాటిలో ఏడో ఎనిమిదో డాడీనే నిర్మించారని…అందుకు ఆయనకు ఏనాడూ నేను సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకోలేదని…ఇంట్లో కూడా చెప్పుకోలేదు అపి చెప్పుకొచ్చాడు. తన లైఫ్‌లో ఫస్ట్ టైం ఇక్కడ చెబుతున్నాను… థాంక్యూ డాడీ అంటూ తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు బన్నీ.
‘‘థాంక్యూ అనేది కేవలం తనతో సినిమా తీసినందుకు కాదు’’ అని బన్నీ అనగానే ఆయన గొంతులో వణుకు మొదలైంది. ఆటోమేటిక్‌గా ఏడుపు వచ్చేసింది. కన్నీటిని దిగమింగుతూ నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ఈ సమయంలో అల్లు అరవింద్ స్టేజ్‌పైకి వచ్చి కొడుకును ఓదార్చాడు. అంతటితో ఆగలేదు..అందరూ తన తండ్రిని తప్పుగా అర్థం చేసుకుంటారని…కానీ తన తండ్రి ఇన్నేళ్లుగా ఓ సినిమా బిజినెస్ చేస్తున్నాడంటే కేవలం నిజాయితీగా ఉంటేనే అది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఎవరి డబ్బులు లాక్కోలేదని…ఎవరినీ మోసం చేయలేదంటూ కొసమెరుపు డైలాగ్ ఇచ్చాడు…
ఇంతకూ అల్లు అర్జున్ అంతలా బరస్ట్ కావడానికి కారణమెవరు..అన్న క్వశ్చన్ ఇప్పుడు అందరిలో స్టార్ట్ అయింది. ఎవరినీ మోసం చేయలేదు..ఎవరి డబ్బూ తీసుకోలేదు అన్న పదాలు ఎందుకొచ్చాయన్నదానిపై రీసెర్చ్ మొదలైంది. అంతేకాదు స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే ముందు …ముందుగా చిరంజీవిని స్మరించుకోవడం అల్లు వారి ఆనవాయితీ..కానీ ఇప్పుడు తండ్రిని ఆకాశానికి మోసి…చిరంజీవిని తర్వాత తలుచుకున్నాడు.
అంతేకాదు అందరూ పవన్ కళ్యాణ్..పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్నారని…కానీ ఈ కట్టే కాలేవరకు చిరంజీవికి అభిమానినని…చెప్పుకొచ్చాడు. అంతవరకు బాగానే ఉంది..కానీ చిరంజీవి తర్వాత ..తాను అభిమానించే హీరో…రజనీకాంత్ అంటూ రాష్ట్రం దాటి వెళ్లిపోయాడు. ఫ్యాన్స్‌లో ఉన్న డౌట్స్‌ను మరింత పెంచేశాడు.
చిరంజీవి అంటే అల్లు అర్జున్‌కు అమిత ప్రేమ..ఇది అందరికీ తెలిసిందే. తండ్రిపై తన ప్రేమను చాటుకోవడం వరకు ఓకే..కానీ పనిగట్టుకుని పవన్ కళ్యాణ్‌ను ఎందుకు పక్కన పెట్టాల్సిన అవసరమొచ్చిందన్న చర్చ మొదలైంది. అల్లు అర్జున్ స్పీచ్‌పై పవన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో గుర్రుగా ఉన్నారు. కావాలనే పవన్ ను బన్నీ టార్గెట్ చేశాడని…అసందర్భంగా తమ హీరోను అవాయిడ్ చేసి..తన మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని బహిరంగంగా వ్యక్త పరిచాడని అంటున్నారు. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న పవన్-అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న విభేదాలు …ఈ ఒక్క స్పీచ్‌తో మరింత రగులుకున్నాయని అంటున్నారు.
అంతేకాదు అల..వైకుంఠపురములో ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ రాకపోవడంపైనా పెద్ద చర్చే నడుస్తోంది. ఏ ఫంక్షన్ జరిగినా…అందుబాటులో ఉన్న మెగా హీరోల్లో ఎవరో ఒకరు రావడం రివాజు. కానీ అల..వైకుంఠపురములో ఫంక్షన్‌కు మాత్రం ఏ ఒక్క మెగా హీరో హాజరుకాలేదు. ఇక్కడే ఏదో తడుతోందన్న డిస్కషన్స్ ఫ్యాన్స్‌లో స్టార్ట్ అయింది. ఒక్క మెగా హీరో లేకుండా బన్నీ ఫంక్షన్ జరుపుకోవడం బహుశా ఇదే కావొచ్చు.
దీనిపైనా టాలీవుడ్‌తో పాటు ఫ్యాన్స్‌లోనూ గుసగుసలు నడుస్తున్నాయి..ఇంతకూ అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగిందా…గ్యాప్ తీసుకున్నారా..అన్నది మిలియన్ డాలర్ల మిస్టరీగా మారింది.