జగన్ పుట్టక ముందే ఆ కంపెనీని సృష్టించాడట
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని వికేంద్రీకరించడమే మంచిదంటూ నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్- బీసీజీ సంస్థపైనా కొందరు రగిలిపోతున్నారు. 57 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఏపీకి సంబంధించి బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ సంస్థపై సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్‌గా ప్రచారం మొదలుపెట్టారు. ఆ సంస్థకు చెందిన వికీపీడియా పేజ్‌పైనా దండయాత్ర చేశారు. జనవరి 3, 4 తేదీల్లో కొందరు వ్యక్తులు బీసీజీకి చెందిన వివరాలను వికీపీడియాలో ఇష్టానికి మార్చేశారు. […]
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని వికేంద్రీకరించడమే మంచిదంటూ నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్- బీసీజీ సంస్థపైనా కొందరు రగిలిపోతున్నారు. 57 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఏపీకి సంబంధించి బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ సంస్థపై సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్‌గా ప్రచారం మొదలుపెట్టారు. ఆ సంస్థకు చెందిన వికీపీడియా పేజ్‌పైనా దండయాత్ర చేశారు. జనవరి 3, 4 తేదీల్లో కొందరు వ్యక్తులు బీసీజీకి చెందిన వివరాలను వికీపీడియాలో ఇష్టానికి మార్చేశారు.
బీసీజీ గ్రూప్ వ్యవస్థాకులుగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల పేర్లను చేర్చారు. బ్రూస్ హెండర్సన్‌తో కలిసి జగన్, విజయసాయిరెడ్డిలు 57ఏళ్ల క్రితం దీన్ని ప్రారంభించారని రాశారు. జగన్ వయసు ఇంకా 47 ఏళ్లే.
అంతటితో ఆగకుండా బీసీజీ సంస్థలో జగన్‌మోహన్ రెడ్డి 50 శాతం వాటాదారుడు అంటూ తప్పుడు వివరాలను జోడించారు. జనవరి 3, 4 తేదీల్లో ఏకంగా 12 సార్లు ఇలా బీసీజీకి చెందిన వికీపీడియాపై కొందరు తప్పుడు సమాచారం చేర్చేందుకు దాడి చేశారు. జరిగిన పొరపాటును గుర్తించిన తర్వాత పేజీలోని వివరాలను సరిచేశారు.
కానీ పేజీ హిస్టరీలో మాత్రం తప్పుడు వివరాలు అలాగే ఉన్నాయి. కొందరు వ్యక్తులు ఆ స్కీన్ షాట్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వికీపీడియాలో వివరాలను జోడించడం, తీసేయడం వంటి అవకాశం ఉండడంతో కొందరు ఇలా తప్పుడు సమాచారం పోస్టు చేస్తున్నారు.
గతంలో వైవీ సుబ్బారెడ్డికి చెందిన వీకీపీడియాలోనూ కొందరు ప్రత్యర్థులు ఆయన క్రిస్టియన్ అంటూ తప్పుడు వివరాలను జోడించారు. కాబట్టి వికీపీడియా సమాచారాన్ని ఫాలో అయ్యే ముందు ఏ అంశంలోనైనా జాగ్రత్తపడడం అవసరమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.