మున్సిపల్ రిజర్వేషన్ ల గెజిట్ విడుదల
తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లు జరుగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయిస్తూ ఈ గెజిట్ వెలువడింది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వార్డులను నిర్ణయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీంతో పాటు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి చైర్ పర్సన్ ల, మేయర్ ల రిజర్వేషన్ […]
తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లు జరుగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయిస్తూ ఈ గెజిట్ వెలువడింది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వార్డులను నిర్ణయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది.
దీంతో పాటు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి చైర్ పర్సన్ ల, మేయర్ ల రిజర్వేషన్ లను కూడా ఈ గెజిట్‌లో పేర్కొన్నారు.
మున్సిపల్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బీసీలకు 29.40, ఎస్టీలకు 5.83, ఎస్సీలకు 14.15 శాతం వార్డులను రిజర్వు చేశారు.
తెలంగాణ పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఎన్నికలు 22న జరగనుండగా ఫలితాలు 24న వెలువడనున్నాయి.