ఆరుబాల్స్ లో ఆరుసిక్సర్లు
క్రికెట్ చరిత్రలో మరో రికార్డు కివీ క్రికెటర్ లియో కార్టర్ వీరబాదుడు క్రికెట్ చరిత్రలో ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు బాదిన ఏడవ క్రికెటర్ గా న్యూజిలాండ్ క్రికెటర్ లియో కార్టర్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. న్యూజిలాండ్ దేశవాళీ టీ-20 క్రికెట్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ లియో కార్టర్ ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ టీ-20 సూపర్ స్మాష్ టోర్నీలో భాగంగా సెంట్రల్ నైట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ […]
- క్రికెట్ చరిత్రలో మరో రికార్డు
- కివీ క్రికెటర్ లియో కార్టర్ వీరబాదుడు
క్రికెట్ చరిత్రలో ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు బాదిన ఏడవ క్రికెటర్ గా న్యూజిలాండ్ క్రికెటర్ లియో కార్టర్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.
న్యూజిలాండ్ దేశవాళీ టీ-20 క్రికెట్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ లియో కార్టర్ ఈ ఘనత సాధించాడు.
న్యూజిలాండ్ టీ-20 సూపర్ స్మాష్ టోర్నీలో భాగంగా సెంట్రల్ నైట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కాంటర్ బరీ కింగ్స్ తరపున ఆడిన లియో కార్టర్ తన బ్యాటుకు పూర్తి స్థాయిలో పని చెప్పాడు.
లెఫ్టామ్ స్పిన్నర్ ఆంటోన్ డేవసిచ్ బౌలింగ్ ఓ ఓవర్ ఆరుకు ఆరుబాల్స్ లో లియో కార్టర్ భారీషాట్లతో విరుచుకుపడి.. గ్రౌండ్ నలుమూలలకు సిక్సర్ల మోత మోగించాడు. కేవలం ఒక్క ఓవర్ లోనే 36 పరుగులు రాబట్టాడు. తనజట్టు భారీవిజయంలో ప్రధానపాత్ర వహించాడు.
హేమాహేమీల సరసన లియో…
ఆరుబాల్స్ లో ఆరు సిక్సర్లు బాదడం ద్వారా…గతంలో ఇదే ఘనత సాధించిన మరో ఆరుగురు క్రికెటర్ల సరసన లియో కార్టర్ నిలిచాడు.
క్రికెట్ చరిత్రలో ఆరుకు ఆరుబాల్స్ లో సిక్సర్లు సాధించిన ఆటగాళ్లలో గారీ సోబర్స్, రవి శాస్త్రి, హెర్షల్ గిబ్స్, యువరాజ్ సింగ్, రోజ్ విట్లే, అప్ఘాన్ హిట్టర్ జజాయ్ ఉన్నారు.
2007 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్, 2017లో విట్లే, 2018లో జజాయ్ ఆరు సిక్సర్ల రికార్డు నమోదు చేయగా..2020 సీజన్ ప్రారంభంలోనే న్యూజిలాండ్ క్రికెటర్ లియో కార్టర్ అరుదైన ఈ ఘనత సాధించడం విశేషం.