Telugu Global
National

జేఎన్‌యూ రక్తసిక్తం... మాస్కుల్లో వచ్చి విద్యార్థులు, ప్రొఫెసర్లను చితకబాదిన వైనం..!

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాస్కులు ధరించిన కొంత మంది యూనివర్సిటీలో విధ్వంసకాండ సృష్టించారు. విద్యార్థులు, ప్రొఫెసర్లను చితకబాదుతూ భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం సృష్టించింది. మాస్కులు ధరించిన వాళ్లు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేశారు. దీంతో పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో విద్యార్థి సంఘం నేత ఐషా ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ దాడికి ఏబీవీపీకి చెందిన […]

జేఎన్‌యూ రక్తసిక్తం... మాస్కుల్లో వచ్చి  విద్యార్థులు, ప్రొఫెసర్లను చితకబాదిన వైనం..!
X

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాస్కులు ధరించిన కొంత మంది యూనివర్సిటీలో విధ్వంసకాండ సృష్టించారు. విద్యార్థులు, ప్రొఫెసర్లను చితకబాదుతూ భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం సృష్టించింది.

మాస్కులు ధరించిన వాళ్లు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్థులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేశారు. దీంతో పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో విద్యార్థి సంఘం నేత ఐషా ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, ఈ దాడికి ఏబీవీపీకి చెందిన వాళ్లే కారణమంటూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపిస్తుండగా.. వామపక్ష విద్యార్ధులు తమ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.

అయితే.. క్యాంపస్‌లో ఇంత భయోత్పాతం జరుగుతున్నా సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు పక్కనే నిల్చొని చూస్తుండటంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 మంది పకడ్బందీగా ముసుగులు ధరించి వచ్చి విద్యార్థులను చితకబాదుతున్నా వారంతా ఎందుకు మౌనంగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

First Published:  6 Jan 2020 4:18 AM IST
Next Story