Telugu Global
Cinema & Entertainment

మరో భారీ సెట్ కు రెడీ అవుతున్న సుకుమార్

రంగస్థలం సినిమా కోసం ఏకంగా రంగస్థలం అనే ఊరునే సెట్ గా వేశాడు సుకుమార్. సినిమాలో చాలా భాగం షూటింగ్ అక్కడే జరిగింది. ఇప్పుడు మరోసారి అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నాడు. ఈసారి అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా అడవి సెట్ వేయబోతున్నాడట ఈ దర్శకుడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతోంది బన్నీ-సుక్కూ సినిమా. ఈ సినిమాలో చాలా భాగం శేషాచలం అడవుల్లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా చేస్తే రెండు సమస్యలు. ఒకటి […]

మరో భారీ సెట్ కు రెడీ అవుతున్న సుకుమార్
X

రంగస్థలం సినిమా కోసం ఏకంగా రంగస్థలం అనే ఊరునే సెట్ గా వేశాడు సుకుమార్. సినిమాలో చాలా భాగం షూటింగ్ అక్కడే జరిగింది. ఇప్పుడు మరోసారి అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నాడు. ఈసారి అల్లు అర్జున్ సినిమా కోసం ఏకంగా అడవి సెట్ వేయబోతున్నాడట ఈ దర్శకుడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతోంది బన్నీ-సుక్కూ సినిమా. ఈ సినిమాలో చాలా భాగం శేషాచలం అడవుల్లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా చేస్తే రెండు సమస్యలు. ఒకటి జనాల తాకిడి తట్టుకోవడం కష్టం. ఇక రెండోది రాబోయే ఎండాకాలం. మండే ఎండల్లో షూటింగ్ ఎవరికైనా ఇబ్బందే.

అందుకే ఈసారి బన్నీ సినిమా కోసం హైదరాబాద్ లోనే శేషాచలం అడవుల సెట్ వేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నాడు సుక్కూ. గతంలో రంగస్థలం సినిమాకు సెట్ వేసింది కూడా ఇతడే.

ప్రస్తుతానికైతే కొన్ని అటవీ ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుతారు. సెట్ అందుబాటులోకి రాగానే అందులోకి షిఫ్ట్ అవుతారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటించనుంది.

First Published:  5 Jan 2020 7:00 AM
Next Story