పీఎస్‌ఆర్ చేతికి ఏసీబీ
ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులును అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు రవాణా శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారామాంజనేయులుకు ఈ రెండు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ పనితీరు కనపరచకపోవడంతో ఇప్పటివరకు […]
ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులును అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు రవాణా శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారామాంజనేయులుకు ఈ రెండు బాధ్యతలు అప్పగించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ పనితీరు కనపరచకపోవడంతో ఇప్పటివరకు ఏసీబీ డీజీ గా ఉన్న కుమార్ విశ్వజిత్ పై బదిలీవేటు వేశారు. సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందిన పీఎస్‌ఆర్ ఆంజనేయులును ఇప్పుడు ఆ స్థానంలో నియమించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ తదితర ఆఫీసుల్లో అవినీతిని అంతమొందించడానికి తీవ్రమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అవినీతి నిరోధక శాఖ ఎప్పటిలానే నిస్తేజంగా ఉండడంతో… ఇక విశ్వజిత్‌తో లాభం లేదని సిఫార్సులకు లొంగని పీఎస్‌ఆర్ ఆంజనేయులు లాంటి అధికారిని నియమిస్తే తప్ప ఏసీబీ ఊహించిన స్థాయిలో పనిచేయదని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది.
కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పీఎస్‌ఆర్ ఆంజనేయులును ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమిస్తారని అందరూ ఊహించారు. అందరి అంచనాలకు భిన్నంగా అప్పుడు ఆయనను రవాణా శాఖ కమిషనర్ గా నియమించారు.
పోలీస్ శాఖ లో డిజీపీ తరువాత అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టు ఏసీబీ డీజీ. అలాంటి పోస్ట్ లో ముఖ్యమంత్రి జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన పీఎస్‌ఆర్ ఆంజనేయులును నియమించడంతో ఇక ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టినట్లేనని అంటున్నారు.