Telugu Global
Cinema & Entertainment

వెంకీ సరసన తొలిసారిగా ప్రియమణి

తెలుగుతెరపై మరో ఫ్రెష్ కాంబినేషన్ సెట్ అయింది. వెంకటేష్-ప్రియమణి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అదే అసురన్ రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈనెల 22 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా వెంకీ, ప్రియమణి మధ్య 4 రోజుల పాటు కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. అంతకంటే ముందు, సినిమాను అధికారికంగా లాంఛ్ చేయబోతున్నారు. ఇండస్ట్రీలో అటు వెంకటేశ్, ఇటు ప్రియమణి ఇద్దరూ చాలా సీనియర్లు. కానీ వెంకటేష్ తో […]

వెంకీ సరసన తొలిసారిగా ప్రియమణి
X

తెలుగుతెరపై మరో ఫ్రెష్ కాంబినేషన్ సెట్ అయింది. వెంకటేష్-ప్రియమణి కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అదే అసురన్ రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈనెల 22 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా వెంకీ, ప్రియమణి మధ్య 4 రోజుల పాటు కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. అంతకంటే ముందు, సినిమాను అధికారికంగా లాంఛ్ చేయబోతున్నారు.

ఇండస్ట్రీలో అటు వెంకటేశ్, ఇటు ప్రియమణి ఇద్దరూ చాలా సీనియర్లు. కానీ వెంకటేష్ తో కలిసి సినిమా చేసే అవకాశం మాత్రం ప్రియమణికి రాలేదు. ఇన్నాళ్లకు అసురన్ రీమేక్ వల్ల ఆ అవకాశం వచ్చింది. నిజానికి ఇది కూడా ప్రియమణి చేయాల్సిన సినిమా కాదు. ఇందులో శ్రియను హీరోయిన్ గా అనుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆమెను తప్పించి ప్రియమణిని తీసుకున్నారు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ అసురుడు సినిమా వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా కోసం చాలామంది కొత్త నటీనటుల్ని తీసుకున్నారు. సినిమాలో దాదాపు 80శాతం కొత్త ముఖాలే కనిపిస్తాయి. 3 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  4 Jan 2020 12:32 AM IST
Next Story