మూడు రాజధానులు... బీజేపీలో మరింత గందరగోళం
ఏపీ సీఎం వైఎస్ జగన్ 3 రాజధానుల ప్రకటనతో టీడీపీ ఖేల్ ఖతం అవుతుందని వైసీపీ సీనియర్లు ముందే ఊహించారు. అన్నట్టే టీడీపీ లబోదిబోమంటూ పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమాలు చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే జగన్ విసిరిన ఈ 3 రాజధానుల వలలో బీజేపీ మాత్రం పూర్తిగా గందరగోళంలో పడింది. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మొదట్లో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం అంటూ మూడు రాజధానుల ఆలోచనకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ 3 రాజధానుల ప్రకటనతో టీడీపీ ఖేల్ ఖతం అవుతుందని వైసీపీ సీనియర్లు ముందే ఊహించారు. అన్నట్టే టీడీపీ లబోదిబోమంటూ పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమాలు చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే జగన్ విసిరిన ఈ 3 రాజధానుల వలలో బీజేపీ మాత్రం పూర్తిగా గందరగోళంలో పడింది.
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మొదట్లో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం అంటూ మూడు రాజధానుల ఆలోచనకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల అంశం తెరపైకి తెచ్చి అమరావతి రాజధాని రైతుల కోసం అంటూ గంటపాటు మౌన దీక్ష చేశాడు.
ఇక మరో బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి అమరావతిలో పెద్ద ఎత్తున భూములున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఆయన లబోదిబోమంటూ ఉద్యమాలకు ప్రణాళికలు వేస్తున్నారు.
బీజేపీ పార్టీకే చెందిన మరో ముఖ్యనాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు రాజధానిగా చేయడాన్ని సమర్థించారు. 3 రాజధానులకు రాయలసీమ అనుకూలమని ఆయన ప్రకటించారు.
ఇక బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహరావు మాత్రం రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ అధికారికంగా నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తామన్నారు.
తాజాగా బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు రంగంలోకి దిగారు. విశాఖపట్నంను రాజధానిగా చేయడాన్ని ఆయన సమర్థించడం విశేషం. ఈ ప్రకటన ఏపీలోని బీజేపీ కార్యకర్తల్లో గందరగోళానికి దారితీసింది.
ప్రస్తుతానికి ఏపీ బీజేపీ నేతలు తమ ప్రాంత ఆకాంక్షలను బట్టి ఎక్కడికక్కడ విడిపోయారని అర్థమవుతోంది. దీనిపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానం అయినా స్పష్టత ఇస్తే బీజేపీ స్టాండ్ పై గందరగోళానికి తెరపడే చాన్స్ ఉంది.