Telugu Global
Cinema & Entertainment

లారెన్స్ కు సర్దిచెప్పిన అక్షయ్ కుమార్

ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అక్షయ్ కుమార్. దీనికి ‘లక్ష్మీబాంబ్’ అనే పేరుపెట్టారు. సౌత్ లో సూపర్ హిట్టయిన కాంచన సినిమాకు రీమేక్ ఇది. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంతా సజావుగా సాగుతున్న టైమ్ లో ఈ సినిమా నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు దర్శకుడు లారెన్స్. సినిమాకు సంబంధించి దర్శకుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అతడి అభిప్రాయం కూడా తీసుకోకుండా సినిమా నుంచి ఓ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా […]

లారెన్స్ కు సర్దిచెప్పిన అక్షయ్ కుమార్
X

ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అక్షయ్ కుమార్. దీనికి ‘లక్ష్మీబాంబ్’ అనే పేరుపెట్టారు. సౌత్ లో సూపర్ హిట్టయిన కాంచన సినిమాకు రీమేక్ ఇది. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంతా సజావుగా సాగుతున్న టైమ్ లో ఈ సినిమా నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు దర్శకుడు లారెన్స్.

సినిమాకు సంబంధించి దర్శకుడికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అతడి అభిప్రాయం కూడా తీసుకోకుండా సినిమా నుంచి ఓ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశాడు నిర్మాత. తన క్రియేటివ్ పార్ట్ లోకి నిర్మాత చొచ్చుకురావడంతో లారెన్స్ హర్ట్ అయ్యాడు. నిజానికి ఇలాంటి విషయాల్లో లారెన్స్ చాలా సీరియస్ గా ఉంటాడు. తన పనిలో ఎవరైనా వేలు పెడితే అస్సలు సహించడు. దీంతో లక్ష్మీబాంబ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

దీంతో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగాడు. లారెన్స్ ను సముదాయించాడు. నిర్మాతను మందలించాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాడు. ఇకపై లారెన్స్ కు చెప్పకుండా ఇలాంటి పనులు చేయనని నిర్మాత మాటిచ్చిన తర్వాతే సెట్స్ పైకి రావడానికి అంగీకరించాడు లారెన్స్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 60శాతం పూర్తయింది. మే నెలలో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ పై కన్నేశాడు అక్షయ్ కుమార్.

First Published:  4 Jan 2020 2:45 PM IST
Next Story