పాకిస్తాన్ మిడతల దండు... భారత్ లో భారీగా పంట నష్టం
పాకిస్తాన్ మిడతల దండు భారత పంటలపై తీవ్రమైన దాడి చేశాయి. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న గుజరాత్, రాజస్థాన్ లోని వ్యవసాయ క్షేత్రాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయి. పాక్ నుంచి వచ్చిన మిడతలతో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆవాలు, జీలకర్ర, పత్తి, బంగాళదుంప, గోధుమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అక్కడి రాష్ట్రాల రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. పాకిస్తాన్ నుంచి భారీ మిడతల సమూహాలు వచ్చాయని.. ఇవి […]
పాకిస్తాన్ మిడతల దండు భారత పంటలపై తీవ్రమైన దాడి చేశాయి. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న గుజరాత్, రాజస్థాన్ లోని వ్యవసాయ క్షేత్రాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయి. పాక్ నుంచి వచ్చిన మిడతలతో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆవాలు, జీలకర్ర, పత్తి, బంగాళదుంప, గోధుమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అక్కడి రాష్ట్రాల రైతులు లబోదిబోమంటున్నారు.
దీనిపై వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. పాకిస్తాన్ నుంచి భారీ మిడతల సమూహాలు వచ్చాయని.. ఇవి ప్రధానంగా ఉష్ణమండలానికి చెందినవని పేర్కొన్నారు. ఈ మిడతలు విమానవేగంతో సమానంగా దూసుకెళ్తాయని వివరించారు.
కాగా పాకిస్తాన్ మిడతల దండుతో భారీ పంటనష్టం వాటిల్లింది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వ చర్యలు సరిపోవని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా మండిపడ్డారు. వెంటనే పురుగుల మందులు పిచికారీ చేయాలని.. అప్పుడే పంటలను కాపాడుకోగలమని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
పాకిస్తాన్ నుంచి ఈ మిడతల దండు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోకి ప్రయాణిస్తున్నాయి. గుజరాత్ లో 1993-94లో కూడా మిడతలు దాడి చేసి తీవ్ర పంట నష్టం కలిగించాయి.. ఆ తర్వాత ఇదే పెద్ద దాడి అని అధికారులు ప్రకటించారు. ఈ మిడతలను చంపడానికి పురుగుల మందు పిచికారీ చేసే ఆపరేషన్ ను మొదలు పెట్టారు.