వంశీ ఎఫెక్ట్.... ఎక్కడా కనిపించడం లేదు!
టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సైలెంట్ అయ్యాడు. వల్లభనేని వంశీతో గొడవ తర్వాత రాజేంద్ర ప్రసాద్ దాదాపు కనుమరుగయ్యాడు. ఈ పరిణామం నాటి నుంచి రాజకీయంగా గానీ.. పొలిటికల్ డిబేట్లపై రాజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న చర్చ సాగుతోంది. ఓ న్యూస్ చానల్ లైవ్‌లో వంశీ-రాజేంద్ర మధ్య ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. వల్లభనేని వంశీ గట్టి కౌంటర్ ఇవ్వడంతో రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. డొక్క […]
టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సైలెంట్ అయ్యాడు. వల్లభనేని వంశీతో గొడవ తర్వాత రాజేంద్ర ప్రసాద్ దాదాపు కనుమరుగయ్యాడు. ఈ పరిణామం నాటి నుంచి రాజకీయంగా గానీ.. పొలిటికల్ డిబేట్లపై రాజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న చర్చ సాగుతోంది.
ఓ న్యూస్ చానల్ లైవ్‌లో వంశీ-రాజేంద్ర మధ్య ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. వల్లభనేని వంశీ గట్టి కౌంటర్ ఇవ్వడంతో రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. డొక్క పగులుద్దంటూ రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. ఇక అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.
వంశీ దెబ్బ రాజేంద్ర ప్రసాద్ కు గట్టిగా తగిలిందని.. మళ్లీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దన్న భావనలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడన్న చర్చ నడుస్తోంది. వంశీతో గొడవ పడ్డప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ దూకుడు తగ్గిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు రాజకీయంగానూ రాజేంద్ర ప్రసాద్ మెత్తబడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అమరావతి ఇష్యూపై సైతం రాజేంద్ర ప్రసాద్ ఎక్కడా స్పందించలేదు. రాజధాని తరలింపుపై టీడీపీ వర్గాలు ఆందోళన చేస్తున్నా రాజేంద్ర ప్రసాద్ నోరు విప్పడం లేదు.
అసలు ఈ ఎమ్మెల్సీ ఎక్కడున్నాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ జాడపై టీడీపీ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ సైలెంట్ వెనుక ఇంకేమైనా కారణముందా..? వంశీతో గొడవే ఈ పరిస్థితి తెచ్చిందా..? అన్నది ఆసక్తిగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో రాజేంద్ర మళ్లీ ఎప్పుడు యాక్టీవ్ అవుతారో అన్నది వేచి చూడాల్సిందే మరీ..!