Telugu Global
Cinema & Entertainment

ఈ ఇద్దరిపై... దిల్ రాజు 60కోట్లు పెట్టాడా?

కరవకంటే పాముకు కోపం.. విడవకంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైందట టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కలా ఇప్పుడు కోట్లు పెట్టుబడి పెట్టి… తేడా వస్తే నిండా మునిగేందుకు రెడీ అయ్యారన్న టాక్ టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వురు’ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామి. ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘అల వైకుంఠపురం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజే తీసుకున్నారు. ఈ రెండు తెలుగు […]

ఈ ఇద్దరిపై... దిల్ రాజు 60కోట్లు పెట్టాడా?
X

కరవకంటే పాముకు కోపం.. విడవకంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైందట టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పరిస్థితి. అడకత్తెరలో పోకచెక్కలా ఇప్పుడు కోట్లు పెట్టుబడి పెట్టి… తేడా వస్తే నిండా మునిగేందుకు రెడీ అయ్యారన్న టాక్ టాలీవుడ్ నుంచి వినిపిస్తోంది.

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వురు’ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామి. ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘అల వైకుంఠపురం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజే తీసుకున్నారు.

ఈ రెండు తెలుగు సినిమాలు సంక్రాంతి బరిలో సై అంటే సై అంటూ పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమా రిలీజ్ హక్కులు దిల్ రాజ్ కే ఉండడంతో… ఇప్పుడు ఆయన అల్లు అర్జున్, మహేష్ బాబుల ఎదురుకాల్పుల్లో చిక్కుకుపోయాడట.

ఆ హీరోల పట్టుదల, ఇగోలతో ఒకే తేదీన తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమౌతుండడంతో నలిగిపోతున్నాడట.. ఈ రెండు సినిమాలు కనుక ఒకేరోజు రిలీజ్ అయితే దిల్ రాజు భారీగా నష్టపోతారు. డిస్ట్రిబ్యూటర్లు కుదేలవుతారు.

మహేష్ బాబు చిత్రాన్ని దిల్ రాజు నైజాం, వైజాగ్ లలో పంపిణీ చేయడానికి 33 కోట్లు చెల్లించాడని తెలిసింది. అదే విధంగా అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురం’ పంపిణీ హక్కులను కూడా దిల్ రాజ్ ఇదే నైజాం, విశాఖ ప్రాంతాలకు 25కోట్లు పెట్టి కొన్నాడట.

ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఓపెనింగ్స్ ఇద్దరూ పంచుకుంటారు. తద్వారా దిల్ రాజు భారీగా డబ్బును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోందట.. ఇలా 60కోట్ల పైచిలుకు ఇద్దరు హీరోలపై పెట్టుబడి పెట్టిన దిల్ రాజు… శనివారం ఆ ఇద్దరు హీరోల యూనిట్లతో చర్చలు జరిపి రిలీజ్ పై వాయిదా వేసుకోవాలని కోరడానికి రెడీ అయినట్లు సమాచారం.

First Published:  4 Jan 2020 2:44 AM
Next Story