మున్సిపల్ బరిలో జగ్గారెడ్డి భార్య !
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ పోరులో తన భార్య నిర్మలా రెడ్డిని బరిలో దించాలన్న ఆలోచనతో జగ్గారెడ్డి అడుగులు వేస్తున్నారు. సంగారెడ్డి మున్సిపల్ పీఠంపై ఎలాగైనా తన భార్యను కూర్చోబెట్టాలన్న పట్టుదలతో జగ్గారెడ్డి ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న చందంగా… జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించారన్న చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజాలు ఓటమి బాట పట్టినా సంగారెడ్డిలో జగ్గారెడ్డి విజయబావుటా ఎగురవేశారు. సంగారెడ్డిలో తన క్రేజ్ ఏమాత్రం […]
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ పోరులో తన భార్య నిర్మలా రెడ్డిని బరిలో దించాలన్న ఆలోచనతో జగ్గారెడ్డి అడుగులు వేస్తున్నారు. సంగారెడ్డి మున్సిపల్ పీఠంపై ఎలాగైనా తన భార్యను కూర్చోబెట్టాలన్న పట్టుదలతో జగ్గారెడ్డి ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న చందంగా… జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించారన్న చర్చ నడుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజాలు ఓటమి బాట పట్టినా సంగారెడ్డిలో జగ్గారెడ్డి విజయబావుటా ఎగురవేశారు. సంగారెడ్డిలో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాలన్న భావనలో జగ్గారెడ్డి ఉన్నారు.
సంగారెడ్డిలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీకే మున్సిపల్ ఎన్నికల్లో అధికారం దక్కుతుంది. ఈ సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందాలని జగ్గారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందడమే కాదు.. చైర్‌పర్సన్ పదవిని తన భార్య నిర్మలారెడ్డికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మీడియా ముఖంగానూ వెల్లడించారు.
రిజర్వేషన్ కనుక అనుకూలంగా వస్తే చైర్‌పర్సన్ పదవే లక్ష్యంగా తన భార్యను బరిలో నిలుపుతానని ప్రకటించారు జగ్గారెడ్డి. రిజర్వేషన్ సహకరిస్తే సంగారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌పరమవడం లాంఛనమేనన్న చర్చ సాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే రిజర్వేషన్ ల అంశంతో… నిలిచేదెవరు..? తప్పుకొనేదెవరు? అన్న ఉత్కంఠకు తెరపడనుంది.