Telugu Global
International

సగటున సంవత్సరంలో 1800 గంటలు ఫోన్ తోనే....

సైబర్ మీడియా రీసెర్చ్ (సిఎంఆర్) సహకారంతో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో చేసిన పరిశోధన నివేదిక ప్రకారం… ప్రతి భారతీయుడు సంవత్సరంలో సగటున 1800 గంటలు మొబైల్‌తో గడుపుతున్నాడు. సైబర్‌మీడియా రీసెర్చ్ (సిఎంఆర్) పరిశోధనలో సగానికి పైగా ప్రజలు మొబైల్ ఫోన్‌ల వ్యసనం బారిన పడ్డారని, అది లేకుండా జీవించలేక పోతున్నారని తేలింది. ‘స్మార్ట్‌ఫోన్ మానవ సంబంధాలపై దాని ప్రభావం’ అనే పేరుతో విడుదలైన నివేదిక…భారతీయ వినియోగదారులపై మొబైల్ ఫోన్ ల ప్రభావాన్ని చక్కగా వివరించింది. స్మార్ట్ […]

సగటున సంవత్సరంలో 1800 గంటలు ఫోన్ తోనే....
X

సైబర్ మీడియా రీసెర్చ్ (సిఎంఆర్) సహకారంతో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో చేసిన పరిశోధన నివేదిక ప్రకారం… ప్రతి భారతీయుడు సంవత్సరంలో సగటున 1800 గంటలు మొబైల్‌తో గడుపుతున్నాడు. సైబర్‌మీడియా రీసెర్చ్ (సిఎంఆర్) పరిశోధనలో సగానికి పైగా ప్రజలు మొబైల్ ఫోన్‌ల వ్యసనం బారిన పడ్డారని, అది లేకుండా జీవించలేక పోతున్నారని తేలింది.

‘స్మార్ట్‌ఫోన్ మానవ సంబంధాలపై దాని ప్రభావం’ అనే పేరుతో విడుదలైన నివేదిక…భారతీయ వినియోగదారులపై మొబైల్ ఫోన్ ల ప్రభావాన్ని చక్కగా వివరించింది.

స్మార్ట్ ఫోన్ తమ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసిందని 73 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి నలుగురిలో ఒకరు స్మార్ట్‌ఫోన్‌ల వాడకంతో వచ్చిన శారీరక సమస్యల గురించి మాట్లాడారు. చాలా మందికి బలహీనమైన కంటి చూపు, కళ్ళమ్మటి నీళ్ళు కారడం, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కలుగుతున్నాయని చెప్పారు.

ప్రతి ఐదుగురిలో నలుగురు పడుకునే ముందు చూసే చివరి వస్తువు ఫోనే అనీ… మేల్కొన్న తర్వాత కూడా మొదటగా చూసేది ఫోనే అని చెప్పారు. 74 శాతం మంది లేచిన 30 నిమిషాల్లోనే మొదట ఫోన్‌ను చూస్తామని చెప్పారు.

అయితే సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి తక్కువ మొబైల్ వినియోగం అవసరమని ఐదుగురిలో ముగ్గురు అంగీకరించారు.

దేశంలోని 8 ప్రధాన నగరాల్లోని వ్యక్తులతో సంభాషించడం ద్వారా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఈ సర్వే జరిపారు. ఈ సర్వేలో 64 శాతం మంది పురుషులను, 36 శాతం మంది మహిళలను ఇంటర్వ్యూ చేశారు.

First Published:  4 Jan 2020 8:03 AM
Next Story