తెలంగాణ సీఎస్ పోస్టింగ్ లో క్విడ్ ప్రోకో...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియామకం తెలంగాణ ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమేశ్ కుమార్ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నా అందరికంటే జూనియర్ అయిన నాలుగేళ్లు సర్వీసు ఉన్న సోమేష్ ను నియమించడంలో అర్థమేంటి అని ఐఏఎస్ లు చర్చించుకుంటున్నారట. సీఎం కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించి క్విడ్ ప్రోకోలో ఈ డీల్ కుదుర్చుకున్నారని తాజాగా కాంగ్రెస్ ఆరోపించడం ఆసక్తి రేపుతోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ అధికార ప్రతినిధి […]
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియామకం తెలంగాణ ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమేశ్ కుమార్ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నా అందరికంటే జూనియర్ అయిన నాలుగేళ్లు సర్వీసు ఉన్న సోమేష్ ను నియమించడంలో అర్థమేంటి అని ఐఏఎస్ లు చర్చించుకుంటున్నారట.
సీఎం కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించి క్విడ్ ప్రోకోలో ఈ డీల్ కుదుర్చుకున్నారని తాజాగా కాంగ్రెస్ ఆరోపించడం ఆసక్తి రేపుతోంది.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ అధికార ప్రతినిధి అయిన డాక్టర్ దాసోజు శ్రవణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ కంటే తెలంగాణలో 15మంది సీనియర్ ఐఏఎస్ లు ఉన్నారని.. బీపీ ఆచార్య, అజయ్ మిశ్రా, సురేష్ చంద్ర, చిత్ర రాంచంద్రన్ లను కాదని సోమేష్ కుమార్ కు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని శ్రవణ్ ప్రశ్నించాడు.
సీఎస్ నియామకంలో కేసీఆర్ సర్కారు పదోన్నతలు, నియమాలు, నిబంధనలు, పూర్వపు సంప్రదాయాలను ఉల్లంఘించిందని దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు.
2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడానికి అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న సోమేష్ కుమార్ సహకరించాడని శ్రవణ్ ఆరోపించారు. దానికి ప్రతి ఫలంగానే క్విడ్ ప్రోకో పద్ధతిలో ఆయనను సీఎస్ గా ఎంపిక చేశారని తీవ్ర విమర్శలు చేశారు.
సోమేష్ కుమార్ నాడు 15 లక్షలకు పైగా ఆంధ్రా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లను తొలగించారని.. వార్డులను పునర్ వ్యవస్థీకరించారని.. పక్షపాతం చూపాడని… అవకతవకలతో టీఆర్ఎస్ ను గెలిపించినందుకే ఈ గిఫ్ట్ ఇచ్చారని శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు.