భారత్ తో టీ-20 సిరీస్... గౌహతీ చేరిన మలింగ సేన
ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా జనవరి 5 నుంచి భారత్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో తలపడటానికి యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ నాయకత్వంలోని శ్రీలంకజట్టు సభ్యులు అసోంలోని గౌహతి చేరుకొన్నారు. పౌరసత్వబిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగుతున్న నేపధ్యంలో… గౌహతిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కొలంబో నుంచి గౌహతీ చేరిన శ్రీలంకజట్టు సభ్యులు నేరుగా తమ విడిది కోసం ఏర్పాటుచేసిన స్టార్ హోటెల్ కు వెళ్లారు. మ్యాచ్ వేదికగా ఉన్న బరాస్ పారా స్టేడియం […]
ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా జనవరి 5 నుంచి భారత్ తో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో తలపడటానికి యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ నాయకత్వంలోని శ్రీలంకజట్టు సభ్యులు అసోంలోని గౌహతి చేరుకొన్నారు. పౌరసత్వబిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగుతున్న నేపధ్యంలో… గౌహతిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కొలంబో నుంచి గౌహతీ చేరిన శ్రీలంకజట్టు సభ్యులు నేరుగా తమ విడిది కోసం ఏర్పాటుచేసిన స్టార్ హోటెల్ కు వెళ్లారు.
మ్యాచ్ వేదికగా ఉన్న బరాస్ పారా స్టేడియం కెపాసిటీ 39 వేల 500 కాగా…ఇప్పటికే 27వేల టికెట్లు విక్రయించినట్లు నిర్వాహక అసోం క్రికెట్ సంఘం ప్రకటించింది.
సిరీస్ లోని తొలి మ్యాచ్ జనవరి 5న, రెండో మ్యాచ్ ఇండోర్ వేదికగా జనవరి 7న, పూణే వేదికగా జనవరి 10న ఆఖరి టీ-20 మ్యాచ్ లు నిర్వహిస్తారు.
మొత్తం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టులో మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా సైతం ఉన్నారు.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ, ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. కాగా గాయాలతో జట్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్, ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా …శ్రీలంకతో సిరీస్ ద్వారా రీఎంట్రీ చేయనున్నారు.