శాటిలైట్ చెప్పిన నిజం... గోదావరి జిల్లాల్లో తగ్గుతున్న వరి సాగు
మత్స్య పరిశ్రమ విరాజిల్లుతోంది. ఫిషరీస్ ఇండస్ట్రీ విస్తరిస్తోంది. మత్స్య ఉత్పత్తుల రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పేరుగడిస్తోంది. ఒకప్పుడు పంట పొలాలతో కళకళలాడిన భూములన్నీ నేడు మత్స్య ఉత్పత్తుల కేంద్రాలుగా మారాయి. గోదావరి జిల్లాలు మత్స్య పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా వర్ధిల్లుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎదిగింది. ఈ ఏడాది ఒక్క ఏపీ నుంచే రూ.16,372 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయడం విశేషం. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంతో మత్స్య […]
మత్స్య పరిశ్రమ విరాజిల్లుతోంది. ఫిషరీస్ ఇండస్ట్రీ విస్తరిస్తోంది. మత్స్య ఉత్పత్తుల రాజధానిగా ఆంధ్రప్రదేశ్ పేరుగడిస్తోంది. ఒకప్పుడు పంట పొలాలతో కళకళలాడిన భూములన్నీ నేడు మత్స్య ఉత్పత్తుల కేంద్రాలుగా మారాయి.
గోదావరి జిల్లాలు మత్స్య పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా వర్ధిల్లుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎదిగింది. ఈ ఏడాది ఒక్క ఏపీ నుంచే రూ.16,372 కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేయడం విశేషం. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంతో మత్స్య పరిశ్రమ వేళ్లూనుకుంటోంది.
చేపలు, రొయ్యల పెంపకందారులకు విద్యుత్ బిల్లుల్లో వైసీపీ ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. 7 రూపాయల విలువైన యూనిట్ విద్యుత్‌ను నామమాత్రంగా రూ.1.5కే ఇస్తూ మత్స్య పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతోంది. లాభాలు బాగుండడంతో రైతులు సైతం మత్స్య పరిశ్రమ వైపు ఆకర్షితులవుతున్నారు.
కృష్ణాతో పాటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సంప్రదాయ వ్యవసాయ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా వ్యవసాయంలో నష్టాలు నమోదవుతున్నాయి. ఈ కారణంగానే రైతాంగం మత్స్య పరిశ్రమ వైపు మళ్లుతోంది. స్థిరమైన ఆదాయం, అనుకూలమైన వాతావరణం ఉండడంతో రైతులు మత్స్య పరిశ్రమను ఎంచుకుంటున్నారు.
కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను భీమవరంలోని తుందూరు గ్రామంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ మెగా ఫుడ్ పార్క్ మొదటిది. అయితే సెప్టెంబర్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఫుడ్ పార్క్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఏపీపీసీబీ)ని ఆదేశించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ ఆదేశాల మేరకు ఫుడ్ పార్కుతో తలెత్తే కాలుష్య సమస్యలపై ఎన్‌జీటీ దృష్టిసారించింది. ఆక్వాకల్చర్ ద్వారా భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయన్న ఆందోళన లేకపోలేదు.
దీనివల్ల జన జీవనానికి ఆటంకం కలుగుతుందని.. వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఆక్వాకల్చర్ వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ లాభాలు మాత్రం ఆశాజనకంగా ఉంటున్నాయి. ఇప్పటికీ మత్స్య పరిశ్రమ ఎదుగుదలకు సరైన మార్గదర్శనం కరువైంది. సరుకు రవాణా పరిశ్రమను వేధిస్తోంది. సమస్యలు.. ప్రతిసవాళ్లు ఉన్నా మత్స్య పరిశ్రమలో ఏపీ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది.