టెస్టు క్రికెట్లో బెస్ట్ టీమిండియా
2019లో ఒక్క ఓటమీ లేని విరాట్ సేన సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ టీమ్ …టీమిండియా 2019 సంవత్సరాన్ని అత్యంత విజయవంతంగా ముగించింది. ఒక్క ఓటమీ లేకుండా తిరుగులేని విజేతగా నిలిచింది. భారతజట్టు నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొంటే…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలవడం ద్వారా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పగలిగారు. 8 టెస్టుల్లో 7 విజయాల భారత్… టీమిండియా 2019లో ఆడిన ఎనిమిది టెస్టుల్లో 7 విజయాలు, ఓ […]
- 2019లో ఒక్క ఓటమీ లేని విరాట్ సేన
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ టీమ్ …టీమిండియా 2019 సంవత్సరాన్ని అత్యంత విజయవంతంగా ముగించింది. ఒక్క ఓటమీ లేకుండా తిరుగులేని విజేతగా నిలిచింది.
భారతజట్టు నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొంటే…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలవడం ద్వారా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పగలిగారు.
8 టెస్టుల్లో 7 విజయాల భారత్…
టీమిండియా 2019లో ఆడిన ఎనిమిది టెస్టుల్లో 7 విజయాలు, ఓ డ్రా రికార్డుతో 87.50 విజయశాతాన్ని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాజట్లు నిలువగలిగాయి.
ఆస్ట్ర్రేలియా 12 టెస్టుల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 డ్రాల రికార్డుతో 66.66 విజయశాతాన్నినమోదు చేసింది. ఐసీసీ టెస్ట్ లీగ్ లో భాగంగా భారత్ ఆడిన మూడుకు మూడు సిరీస్ ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. విండీస్ పై 2-0, సౌతాఫ్రికాపై 3-0, బంగ్లాదేశ్ పైన 2-0తో క్లీన్ స్వీప్ విజయాలు నమోదు చేసింది.
2001- 2019లో భారత్ జోరు…
గత దశాబ్దకాలంలో టీమిండియా మొత్తం మూడు ఫార్మాట్లలోనూ 462 మ్యాచ్ లు ఆడి 281 విజయాలు సాధించింది. టెస్ట్ క్రికెట్లో 107 మ్యాచ్ లు ఆడి 56 విజయాలు, 29 పరాజయాలు, 22 డ్రాలతో 52.34 సక్సెస్ రేట్ ను నమోదు చేసింది.
వన్డే క్రికెట్లో 249 మ్యాచ్ లు ఆడి 157 విజయాలు, 79 పరాజయాలతో 63.05 విజయశాతం సాధించింది. టీ-20ల్లో ఆడిన 106మ్యాచ్ ల్లో 68 వజయాలు, 36 పరాజయాలు, ఫలితం తేలని 2 మ్యాచ్ లతో 64.15 విజయశాతాన్ని నమోదు చేయగలిగింది.
విరాట్ విశ్వరూపం..
గత దశాబ్దకాలంలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ వన్డే క్రికెట్లో 11వేల పరుగులు సాధించడం ద్వారా…అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ గా నిలిచాడు.
సచిన్ 276 ఇన్నింగ్స్ లో 11వేల పరుగులు సాధిస్తే…కొహ్లీ అతితిక్కువ ఇన్నింగ్స్ లోనే 11వేల మైలురాయిని చేరడం విశేషం. గత దశాబ్దకాలంగా చూసినా…గత ఏడాది కాలంలోచూసినా టీమిండియానే అత్యుత్తమ జట్టుగా సత్తా చాటుకోగలిగింది.