Telugu Global
Cinema & Entertainment

లోకల్ సింగర్స్ పై తమన్ కామెంట్

ఏ రంగంలోనైనా దూరపు కొండలు నునుపు అంటారు. టాలీవుడ్ లోనైతే ఈ కల్చర్ మరీ ఎక్కువ. బాలీవుడ్ నుంచి ఓ సింగర్ ను తీసుకొచ్చి ఇక్కడ పాడిస్తే అదో గొప్ప. అయితే తమన్ మాత్రం ఈ విషయం ఒప్పుకోవడం లేదు. టాలీవుడ్ లో సింగింగ్ టాలెంట్ కు కొదవలేదంటున్నాడు ఈ సంగీత దర్శకుడు. “గాయకులకు బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. సింగర్స్ కు హైదరాబాద్ బెస్ట్. ఇండియా మొత్తం మీద చూసుకుంటే ది బెస్ట్ సింగింగ్ టీమ్ హైదరాబాద్ […]

లోకల్ సింగర్స్ పై తమన్ కామెంట్
X

ఏ రంగంలోనైనా దూరపు కొండలు నునుపు అంటారు. టాలీవుడ్ లోనైతే ఈ కల్చర్ మరీ ఎక్కువ. బాలీవుడ్ నుంచి ఓ సింగర్ ను తీసుకొచ్చి ఇక్కడ పాడిస్తే అదో గొప్ప. అయితే తమన్ మాత్రం ఈ విషయం ఒప్పుకోవడం లేదు. టాలీవుడ్ లో సింగింగ్ టాలెంట్ కు కొదవలేదంటున్నాడు ఈ సంగీత దర్శకుడు.

“గాయకులకు బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. సింగర్స్ కు హైదరాబాద్ బెస్ట్. ఇండియా మొత్తం మీద చూసుకుంటే ది బెస్ట్ సింగింగ్ టీమ్ హైదరాబాద్ లోనే ఉంది. నా 110 సినిమాల అనుభవంతో చెబుతున్నాను, హైదరాబాద్ లో ఉన్నంతమంది బెస్ట్ సింగర్స్ ఎక్కడా లేరు.”

అయితే సింగర్స్ ఉన్నంత మాత్రాన సరిపోదంటున్నాడు తమన్. మ్యూజీషియన్స్ ఉన్నప్పుడే రీ-రికార్డింగ్, సాంగ్ కంపోజింగ్ ఈజీ అవుతుందంటున్నాడు. ఆ విషయంలో మాత్రం హైదరాబాద్ చాలా వెనకబడి ఉందని, అందుకే తను తరుచుగా చెన్నై వెళ్తుంటానని చెబుతున్నాడు.

“ప్రతిసారి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సి వస్తోంది. ఎందుకంటే ఇక్కడ మ్యూజిషియన్స్ లేరు. హార్మోనియం తప్ప మిగతా మ్యూజిషియన్స్ లేరు. వాళ్లను చెన్నై నుంచి తీసుకురావాల్సిందే. వాళ్లందరికీ ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చేసి, ఇక్కడికి తీసుకొచ్చి రోజున్నర పేమెంట్ ఇచ్చే బదులు.. నేను చెన్నై వెళ్లడం బెటర్ కదా. ఇప్పుడు అదే చేస్తున్నాను. వీణ, వయొలిన్, గిటార్ ప్లేయర్స్ కావాలంటే చెన్నై వెళ్లాల్సిందే.”

పోస్ట్ ప్రొడక్షన్ లో తెలుగు సినిమా వెనకబడి ఉందంటున్నాడు తమన్. ఆఖరి నిమిషంలో ఫూటేజ్ ఇచ్చి రీ-రికార్డింగ్ చేయమంటున్నారని, అదనపు పనిగంటలు కష్టపడి పని పూర్తిచేయాల్సి వస్తోందని అన్నాడు. అయితే ఆఖరి నిమిషంలో పని అప్పగించినా అవుట్ పుట్ లో మాత్రం తేడా ఉండదంటున్నాడు తమన్.

First Published:  31 Dec 2019 6:30 AM IST
Next Story