Telugu Global
Cinema & Entertainment

ఆ ముచ్చట కూడా తీరిపోతోందిగా సునీల్

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. టాప్ పొజిషన్ కు చేరుకుంటాడనే టైమ్ కు హీరోగా మారాడు. హీరోగా కూడా ఓ 2 హిట్స్ కొట్టాడు. అంతలోనే డౌన్ అయ్యాడు. చాన్నాళ్ల పాటు ప్రయత్నించి తిరిగి ఇప్పుడు కమెడియన్ గా మారాడు సునీల్. ఈ క్రమంలో విలన్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు ఈ నటుడు. సునీల్ విలన్ గా కలర్ ఫొటో అనే సినిమా ముస్తాబవుతోంది. సుహాస్, చాందిని చౌదరీ హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఆ […]

sunil
X

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. టాప్ పొజిషన్ కు చేరుకుంటాడనే టైమ్ కు హీరోగా మారాడు. హీరోగా కూడా ఓ 2 హిట్స్ కొట్టాడు. అంతలోనే డౌన్ అయ్యాడు. చాన్నాళ్ల పాటు ప్రయత్నించి తిరిగి ఇప్పుడు కమెడియన్ గా మారాడు సునీల్. ఈ క్రమంలో విలన్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు ఈ నటుడు.

సునీల్ విలన్ గా కలర్ ఫొటో అనే సినిమా ముస్తాబవుతోంది. సుహాస్, చాందిని చౌదరీ హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఆ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు సునీల్. యూట్యూబ్ లో పాపులరైన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, అలాగే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో విలనీ పండించాలనే సునీల్ కల నెరవేరబోతోంది.

అంతా బాగానే ఉంది కానీ సునీల్ కెరీర్ మాత్రం సాఫీగా సాగడం లేదు. కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా క్లిక్ అవ్వలేకపోయాడు ఈ నటుడు. చివరికి బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కూడా సునీల్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. కనీసం ఈ విలన్ పాత్రతోనైనా సునీల్ క్లిక్ అవుతాడేమో చూడాలి.

First Published:  31 Dec 2019 2:23 AM IST
Next Story