కొత్త సీఎస్‌గా కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు?
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సర్వీసు రేపటితో ముగుస్తోంది. మంగళవారం నాడు ఆయన పదవీ విరమణ చేస్తుండటంతో కొత్త సీఎస్‌ను కేసీఆర్ ఎంపిక చేయాల్సి ఉంది. ఇవాళ వేములవాడ, మిడ్ మానేరు డ్యామ్ పర్యటనకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. సాయంత్రం కల్లా ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. రాత్రి లోపు కొత్త సీఎస్‌ను ఎంపిక చేసి మంగళవారం ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సీఎస్ రేసులో […]
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సర్వీసు రేపటితో ముగుస్తోంది. మంగళవారం నాడు ఆయన పదవీ విరమణ చేస్తుండటంతో కొత్త సీఎస్‌ను కేసీఆర్ ఎంపిక చేయాల్సి ఉంది. ఇవాళ వేములవాడ, మిడ్ మానేరు డ్యామ్ పర్యటనకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. సాయంత్రం కల్లా ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. రాత్రి లోపు కొత్త సీఎస్‌ను ఎంపిక చేసి మంగళవారం ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్‌లు ముందంజలో ఉన్నారు. వీరిద్దరి పేర్లనే సీఎం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ మిశ్రా పని చేస్తుండగా… రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు.
కాగా, అజయ్ మిశ్రాకు వచ్చే ఏడాది జులై వరకు మాత్రమే సర్వీసు ఉంది. ఇది ఆయనకు ప్రతికూలంగా పరిణమించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక సోమేష్ కుమార్‌కు 2023 డిసెంబర్ వరకు సర్వీసు ఉంది. ఇది బాగా కలిసొచ్చే అంశం. ఈ రెండు అంశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు.
మరోవైపు ముందు ఏడు నెలల పాటు అజయ్ మిశ్రాకు ఛాన్స్ ఇచ్చి.. ఆ తర్వాత సోమేష్ కుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా సీఎం నియమిస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.