Telugu Global
NEWS

పానీపూరీ కుర్రోడు జైస్వాల్ జైత్రయాత్ర

భారత్ కు ఒంటిచేత్తో గెలుపు అందించిన యశస్వి భారత యువక్రికెటర్, ముంబై ఫుట్ పాత్ ల మీద పానీపూరి తిని పెరిగిన కుర్రోడు యశస్వి జైస్వాల్…స్వదేశంలో మాత్రమే కాదు…విదేశీ గడ్డపైన సైతం తన సత్తా చాటుకొంటూ…భారత్ ను విజేతగా నిలుపుతూ వస్తున్నాడు. సఫారీ గడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల అండర్ -19 టెస్టు సిరీస్ రెండోమ్యాచ్ లో 17 ఏళ్ల జైస్వాల్ తన ఆల్ రౌండ్ ప్రతిభతో భారత్ ను విజేతగా నిలిపాడు. ఈస్ట్ లండన్ లోని […]

పానీపూరీ కుర్రోడు జైస్వాల్ జైత్రయాత్ర
X
  • భారత్ కు ఒంటిచేత్తో గెలుపు అందించిన యశస్వి

భారత యువక్రికెటర్, ముంబై ఫుట్ పాత్ ల మీద పానీపూరి తిని పెరిగిన కుర్రోడు యశస్వి జైస్వాల్…స్వదేశంలో మాత్రమే కాదు…విదేశీ గడ్డపైన సైతం తన సత్తా చాటుకొంటూ…భారత్ ను విజేతగా నిలుపుతూ వస్తున్నాడు.

సఫారీ గడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల అండర్ -19 టెస్టు సిరీస్ రెండోమ్యాచ్ లో 17 ఏళ్ల జైస్వాల్ తన ఆల్ రౌండ్ ప్రతిభతో భారత్ ను విజేతగా నిలిపాడు.

ఈస్ట్ లండన్ లోని బఫెలో పార్క్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా 30 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలడంలో జైస్వాల్ ప్రధానపాత్ర వహించాడు.

జైస్వాల్ కేవలం 3.5 ఓవర్లలోనే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా సఫారీలను కుప్పకూల్చాడు.

ఆ తర్వాత భారత్ తరపున బ్యాటింగ్ కు దిగిన జైస్వాల్ 56 బాల్స్ తో 86 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా 8 వికెట్ల విజయం అందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సైతం జైస్వాల్ సొంతం చేసుకొన్నాడు.

వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరుగనున్న 2020 జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారతజట్టులో యశస్వి జైస్వాల్ సైతం సభ్యుడుగా ఉన్నాడు.

First Published:  29 Dec 2019 2:27 AM IST
Next Story