Telugu Global
NEWS

ఆంధ్రజ్యోతిపై 100 కోట్ల దావా

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3వేల 243 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల తిరుమల విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి చెక్ పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకోసం టీటీడీకి ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తిరుమల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే తక్షణం గుర్తించి చర్యలు తీసుకునేలా సైబర్ విభాగం పనిచేస్తుందని […]

ఆంధ్రజ్యోతిపై 100 కోట్ల దావా
X

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3వేల 243 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇటీవల తిరుమల విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి చెక్ పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకోసం టీటీడీకి ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

తిరుమల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే తక్షణం గుర్తించి చర్యలు తీసుకునేలా సైబర్ విభాగం పనిచేస్తుందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. సైబర్ విభాగానికి సాంకేతిక సహాయం అందించేందుకు పలు ఐటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసే సైబర్ విభాగానికి డీఎస్పీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని చెప్పారు. ఈ విభాగాన్ని ఏపీ పోలీస్‌ శాఖతో అనుసంధానం చేస్తామని… దాని వల్ల తక్షణమే నిందితులను పట్టుకుని చర్యలు తీసుకునేందుకు సులువుగా ఉంటుందని వివరించారు.

రమణదీక్షితులను గౌరవ ప్రధానార్చకుడిగా నియమించినట్టు వివరించారు. రమణదీక్షితులని గౌరవ ప్రధానార్చకుడిగా నియమించిన నేపథ్యంలో ఆలయ అర్చకులు వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. రమణదీక్షితులు నియామకం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని… వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.

జమ్ముకశ్మీర్‌లో శ్రీవారి ఆలయం నిర్మించాల్సిందిగా అక్కడి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చిందని… అందుకు టీటీడీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి ప్రత్యేక చరిత్ర ఉన్నందున అక్కడ కూడా శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నట్టు వెల్లడించారు.

తిరుమల ఘాట్‌ రోడ్లను సిమెంట్‌ రోడ్డుగా మార్చే యోచన ఉందన్నారు. సిమెంట్ రోడ్లు వేసేందుకు అవసరమైన సాయం అందించేందుకు… టీటీడీ బోర్డులో ఉన్న ఇద్దరు సిమెంట్ కంపెనీల అధిపతులు ముందుకొచ్చారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

ఆంధ్రజ్యోతి పత్రికపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు వివరించారు. డిసెంబర్ 1న ఆంధ్రజ్యోతి పత్రిక వెంకన్న వెబ్‌సైట్‌లోకి యేసయ్య అంటూ కథనాన్ని రాసింది. పూర్తి అవాస్తవాలతో కథనం రాసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందున ఆ పత్రికపై 100 కోట్లకు దావా వేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.

వ్యక్తిగతంగా తమపై నిందలు వేసినా సహిస్తాం గానీ… నేరుగా వేంకటేశ్వరస్వామి పైనే తప్పుడు కథనాలు రాస్తే సహించబోమని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

First Published:  28 Dec 2019 3:49 PM IST
Next Story