కరీంనగర్‌లో కనిపించని గులాబీ సింగ్ !
కరీంనగర్ కార్పొరేషన్ లో ఎన్నికల వేడి రాజుకుంది. టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు ఇప్పటికే నిర్వహించింది. అయితే ఈ మీటింగ్‌లకు మేయర్ రవీందర్ సింగ్ రాలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్‌లో చేసిన కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు పార్టీ సమావేశాలకు రావడం లేదు అనే చర్చ మొదలైంది. ఎన్నికల వేళ గులాబీ గూటిలో లుకలుకలు మొదలయ్యాయనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మంత్రి గంగుల కమలాకర్‌తో మేయర్ రవీందర్‌కు గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాప్ […]
కరీంనగర్ కార్పొరేషన్ లో ఎన్నికల వేడి రాజుకుంది. టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు ఇప్పటికే నిర్వహించింది. అయితే ఈ మీటింగ్‌లకు మేయర్ రవీందర్ సింగ్ రాలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్‌లో చేసిన కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయన ఎందుకు పార్టీ సమావేశాలకు రావడం లేదు అనే చర్చ మొదలైంది.
ఎన్నికల వేళ గులాబీ గూటిలో లుకలుకలు మొదలయ్యాయనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మంత్రి గంగుల కమలాకర్‌తో మేయర్ రవీందర్‌కు గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాప్ ఈ మధ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గంగుల వెంట మేయర్ నడిచారు. కానీ మంత్రి అయిన తర్వాత గంగుల ఆయన్ని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటు మేయర్ కూడా ఆయన పిలవకపోవడంతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ కార్పొరేషన్‌లో పది మంది సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్లకు కత్తెర పెట్టాలనేది మంత్రి ప్లాన్. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కార్పొరేటర్లు తనకు సహకరించలేదని మంత్రి అంటున్నారు.
అయితే టికెట్లు రాకపోతే బీజేపీ లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో వారు ఉన్నారు. మొత్తానికి కరీంనగర్ గులాబీలో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. ఇవి టికెట్ల ఖరారు టైమ్‌కు మరింత ముదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి.