ఎటీఎం ద్వారా డబ్బు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి...
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ సరికొత్త ముందడుగు వేసింది. ఇక నుంచి ఏటీఎం ద్వారా డబ్బు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది ఎస్‌బీఐ. ఈ రూల్ కొత్త సంవత్సరం 2020, జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. ఏటీఎం లావాదేవీలను నియంత్రించడంతో పాటు సైబర్ నేరస్థుల ఆట కట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేసింది ఎస్‌బీఐ. కొత్త నిబంధన ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల […]
సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ సరికొత్త ముందడుగు వేసింది. ఇక నుంచి ఏటీఎం ద్వారా డబ్బు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది ఎస్‌బీఐ. ఈ రూల్ కొత్త సంవత్సరం 2020, జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. ఏటీఎం లావాదేవీలను నియంత్రించడంతో పాటు సైబర్ నేరస్థుల ఆట కట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేసింది ఎస్‌బీఐ.
కొత్త నిబంధన ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డబ్బు డ్రా చేసేవారు ఓటీపీ యూజ్ చేయాల్సి ఉంటుంది. 10 వేల పై చిలుకు డ్రా చేసుకొనే వారు మాత్రమే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని.. వినియోగదారుల భద్రత కోసమే ఈ ఓటీపీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎస్‌బీఐ ప్రకటించింది.
ఏటీఎం సెంటర్‌లో లావాదేవీ ప్రక్రియలో భాగంగా వినియోగదారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్‌పై సంబంధిత ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డబ్బులు ఖాతాదారుల చేతికి అందుతాయి.
ప్రస్తుతానికి ఎస్‌బీఐ ఏటీఎంలలో మాత్రమే ఈ ఓటీపీ సదుపాయం అందుబాటులో ఉంది. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఎన్ఎఫ్సీలో ఈ ఫీచర్‌ను ఇంకా అప్‌డేట్ చేయకపోవడంతో ఇతర బ్యాంకుల్లో జరిపే లావాదేవీలకు ఓటీపీ అవసరం ఉండదు.
ఎస్‌బీఐ విధించిన ఓటీపీ నిబంధన వినియోగదారులకు ఏ మేర ఉపయోగపడుతుందన్న చర్చ సాగుతోంది. ఈ రోజుల్లో ప్రతి ఆన్‌లైన్ లావాదేవీ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ ఓటీపీని తప్పనిసరి చేశాయి. అయితే పలు సందర్భాల్లో వినియోగదారులు జరిపే లావాదేవీల సమయంలో ఓటీపీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం ఓటీపీ నిబంధనను ఏటీఎం సెంటర్లలోనూ అమలు చేస్తుండడంపై వినియోగదారులు కొంత ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలతో ఓటీపీ రావడం ఆలస్యమైతే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఓటీపీ వచ్చేంత వరకూ ఏటీఎం సెంటర్ దగ్గర పడిగాపులు కాయాల్సిందేనా అన్న చర్చకు తెరలేచింది. ఎస్‌బీఐ తీసుకొచ్చిన ఓటీపీ రూల్ వినియోగదారులకు లాభమా.. నష్టమా అన్నది వేచి చూడాల్సిందే.