Telugu Global
NEWS

రంజీట్రోఫీ లీగ్ లో అతిపెద్ద సంచలనం

రైల్వేస్ చేతిలో ముంబై ఘోరపరాజయం రంజీ ట్రోఫీ 2019- 2020 సీజన్ లీగ్ రెండో రౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. 41సార్లు రంజీ విజేత ముంబైకి ఘోరపరాజయం ఎదురయ్యింది. భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, యువఓపెనర్ పృథ్వీ షా లాంటి మొనగాళ్లున్నా ఏమాత్రం పేరులేని ఇండియన్ రైల్వేస్ జట్టు చేతిలో ముంబైకి ఓటమి తప్పలేదు. హోంగ్రౌండ్ వాంఖెడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రైల్వేస్ 10 వికెట్ల తేడాతో ముంబైని కంగు తినిపించింది. […]

రంజీట్రోఫీ లీగ్ లో అతిపెద్ద సంచలనం
X
  • రైల్వేస్ చేతిలో ముంబై ఘోరపరాజయం

రంజీ ట్రోఫీ 2019- 2020 సీజన్ లీగ్ రెండో రౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. 41సార్లు రంజీ విజేత ముంబైకి ఘోరపరాజయం ఎదురయ్యింది. భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, యువఓపెనర్ పృథ్వీ షా లాంటి మొనగాళ్లున్నా ఏమాత్రం పేరులేని ఇండియన్ రైల్వేస్ జట్టు చేతిలో ముంబైకి ఓటమి తప్పలేదు.

హోంగ్రౌండ్ వాంఖెడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రైల్వేస్ 10 వికెట్ల తేడాతో ముంబైని కంగు తినిపించింది.

మ్యాచ్ తొలిరోజు ఆటలో 114 పరుగులకే కుప్పకూలిన ముంబై…రెండోఇన్నింగ్స్ లో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రైల్వేస్ ఫాస్ట్ బౌలర్ హిమాంశు సంగ్వాన్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ప్రత్యర్థి రైల్వేస్ 42 పరుగుల విజయలక్ష్యాన్నివికెట్ నష్టపోకుండా సాధించడం ద్వారా ప్రస్తుత సీజన్ ఎలైట్ గ్రూప్- బీ రెండో రౌండ్లో అతిపెద్ద సంచలనం నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ విజయంతో రైల్వేస్ 7 పాయింట్లు తన ఖాతాలో జమచేసుకొంది.

లీగ్ తొలిరౌండ్లో బరోడాపై భారీవిజయం సాధించిన ముంబై ..మూడోరౌండ్ మ్యాచ్ లో జనవరి 3న కర్ణాటకతో తలపడాల్సి ఉంది.

First Published:  28 Dec 2019 2:42 AM IST
Next Story