Telugu Global
NEWS

శ్రీకాంత్, అంజుమ్ లకు సీకె నాయుడు అవార్డులు

జనవరి 12న బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం భారత క్రికెట్ బోర్డు ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక సీకెనాయుడు జీవనసాఫల్యం పురస్కారాలను భారత మాజీ కెప్టెన్లు కృష్ణమాచారీ శ్రీకాంత్, అంజుమ్ చోప్రా అందుకోనున్నారు. తమ క్రికెట్ కెరియర్ లో భారత్ క్రికెట్ కు అందించిన పురుష, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గత కొద్ది సంవత్సరాలుగా భారత తొలికెప్టెన్ సీకె నాయుడు పేరుతో జీవనసాఫల్య పురస్కారాలు అందచేస్తూ వస్తోంది. ఇప్పటికే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సలీమ్ దురానీ, దిలీప్ […]

శ్రీకాంత్, అంజుమ్ లకు సీకె నాయుడు అవార్డులు
X
  • జనవరి 12న బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం

భారత క్రికెట్ బోర్డు ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక సీకెనాయుడు జీవనసాఫల్యం పురస్కారాలను భారత మాజీ కెప్టెన్లు కృష్ణమాచారీ శ్రీకాంత్, అంజుమ్ చోప్రా అందుకోనున్నారు.

తమ క్రికెట్ కెరియర్ లో భారత్ క్రికెట్ కు అందించిన పురుష, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గత కొద్ది సంవత్సరాలుగా భారత తొలికెప్టెన్ సీకె నాయుడు పేరుతో జీవనసాఫల్య పురస్కారాలు అందచేస్తూ వస్తోంది.

ఇప్పటికే సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సలీమ్ దురానీ, దిలీప్ వెంగ్ సర్కార్, శాంతా రంగస్వామి, పద్మాకర్ శివాల్కర్, రాజేందర్ గోయెల్ లాంటి ఎందరో అలనాటి క్రికెటర్లు జీవనసాఫల్య పురస్కారాలను అందుకొన్నవారిలో ఉన్నారు.

2019 సీకేనాయుడు పురస్కారాలకోసం పురుషుల, మహిళల విభాగాలలో భారతమాజీ కెప్టెన్లు కృష్ణమాచారీ శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలను బీసీసీఐ ఎంపిక చేసింది.

డాషింగ్ ఓపెనర్ శ్రీకాంత్…

హెల్మెట్లు లేని రోజుల్లోనే కరీబియన్ అరివీరభయంకర ఫాస్ట్ బౌలర్లను నిర్భయంగా ఎదుర్కొని సిక్సర్లు, బౌండ్రీలు అలవోకగా బాదిన మొనగాడు శ్రీకాంత్.

1981- 1992 మధ్యకాలంలో భారత్ కు ఓపెనర్ గా సేవలు అందించిన శ్రీకాంత్ కు 43 టెస్టుల్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో సహా 2 వేల 62 పరుగులు సాధించిన రికార్డు ఉంది.

కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టులో సైతం శ్రీకాంత్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం 60 సంవత్సరాల వయసులో శ్రీకాంత్ సీకే నాయుడు అవార్డును అందుకోడం ద్వారా తన క్రికెట్ జీవితాన్ని సాఫల్యం చేసుకోనున్నాడు. 1992లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొన్న శ్రీకాంత్ 2009నుంచి 12 వరకూ చీఫ్ సెలెక్టర్ గా సేవలు అందించారు.

మహిళా క్రికెట్ మేటి అంజుమ్

42 సంవత్సరాల అంజుమ్ చోప్రాకు ..మిథాలీరాజ్ తర్వాత అత్యంత విజయవంతమైన భారత మహిళాక్రికెటర్ గా పేరుంది. అంజుమ్ తనకెరియర్ లో 12 టెస్టులు ఆడి 548 పరుగులు, 127 వన్డేల్లో 18 హాఫ్ సెంచరీలు, 18 టీ-20లు ఆడటంతో పాటు 2005 మహిళా ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన భారతజట్టులో సభ్యురాలిగా సైతం ఉండటం విశేషం.

First Published:  28 Dec 2019 12:54 AM GMT
Next Story