ఆ సినిమాలో అల్లరోడు లేడు
ఇది రవితేజ డిస్కోరాజాకు సంబంధించిన మేటర్. ఈ సినిమాలో అల్లరినరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ చాన్నాళ్లుగా ఓ పుకారు ఉంది. సరే సినిమాకు ప్రచారం వస్తోంది కదా అని మేకర్స్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు. అయితే సరిగ్గా సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న టైమ్ లో మూవీపై అనవసరంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. పైగా రవితేజ ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు. ఇలాంటి టైమ్ లో అల్లరినరేష్ కూడా ఉన్నాడనే పుకారును […]
ఇది రవితేజ డిస్కోరాజాకు సంబంధించిన మేటర్. ఈ సినిమాలో అల్లరినరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ చాన్నాళ్లుగా ఓ పుకారు ఉంది. సరే సినిమాకు ప్రచారం వస్తోంది కదా అని మేకర్స్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వకుండా నాన్చుతూ వచ్చారు.
అయితే సరిగ్గా సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న టైమ్ లో మూవీపై అనవసరంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. పైగా రవితేజ ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు. ఇలాంటి టైమ్ లో అల్లరినరేష్ కూడా ఉన్నాడనే పుకారును అలా వదిలేస్తే, అది మొదటికే మోసం తీసుకొచ్చే ప్రమాదం ఉందని యూనిట్ భావించింది. అందుకే ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చింది.
తమ సినిమాలో అల్లరి నరేష్ లేడని ప్రకటించాడు దర్శకుడు వీఐ ఆనంద్. ప్రాజెక్టు ప్రారంభంలో అల్లరి నరేష్ కోసం ఓ పాత్ర అనుకున్నప్పటికీ, తర్వాత కథలో మార్పుల వల్ల అల్లరినరేష్ కు డిస్కోరాజాలో స్థానం దక్కలేదని స్పష్టంచేశాడు. దీంతో ఇన్నాళ్లుగా డిస్కోరాజాపై నడిచిన పుకార్లకు చెక్ పడింది.
ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన మహర్షి సినిమాలో కీలక పాత్ర పోషించాడు అల్లరినరేష్. ఆ సినిమా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది కూడా. దీంతో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే, ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అల్లరినరేష్ ఇప్పటికే ప్రకటించాడు.
ఇందులో భాగంగా ప్రారంభంలో డిస్కోరాజా కథను అతడు ఒప్పుకున్నాడు కూడా. కాకపోతే తర్వాత కథలో చాలా మార్పులు జరగడం, తన పాత్ర నిడివి తగ్గిపోవడంతో అల్లరినరేష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.