Telugu Global
NEWS

క‌మిటీ నివేదికే ఫైన‌ల్‌... వైసీపీ నేత‌ల క్లారిటీ

ఏపీ రాజ‌ధానిపై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. విశాఖ ఎగ్జిక్యూటీవ్ హెడ్‌క్వార్ట‌ర్‌గా నిర్ణయం అయిపోయింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల‌యంలో స‌మావేశ‌మైన వైసీపీ ముఖ్య నేత‌లు రాజ‌ధాని అంశంపై ప్రధానంగా చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో నేత‌లంతా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగ‌తించాల‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక‌డుగు ముందుకేసిన అంబ‌టి రాంబాబు జీఎన్‌రావు క‌మిటీ రిపోర్టును శిర‌సావ‌హిస్తామ‌ని చెప్పి మద్దతు పలికారు. ఎంపీ విజ‌సాయిరెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన కొన్ని గంట‌ల్లోనే జ‌రిగిన వైసీపీ మీటింగ్‌లో నేత‌లంతా ముక్తకంఠంతో విశాఖ‌కే జై […]

క‌మిటీ నివేదికే ఫైన‌ల్‌... వైసీపీ నేత‌ల క్లారిటీ
X

ఏపీ రాజ‌ధానిపై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. విశాఖ ఎగ్జిక్యూటీవ్ హెడ్‌క్వార్ట‌ర్‌గా నిర్ణయం అయిపోయింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాల‌యంలో స‌మావేశ‌మైన వైసీపీ ముఖ్య నేత‌లు రాజ‌ధాని అంశంపై ప్రధానంగా చ‌ర్చించారు.

ఈ స‌మావేశంలో నేత‌లంతా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగ‌తించాల‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక‌డుగు ముందుకేసిన అంబ‌టి రాంబాబు జీఎన్‌రావు క‌మిటీ రిపోర్టును శిర‌సావ‌హిస్తామ‌ని చెప్పి మద్దతు పలికారు.

ఎంపీ విజ‌సాయిరెడ్డి ప్రెస్‌మీట్ ముగిసిన కొన్ని గంట‌ల్లోనే జ‌రిగిన వైసీపీ మీటింగ్‌లో నేత‌లంతా ముక్తకంఠంతో విశాఖ‌కే జై కొట్టారు. అమ‌రావ‌తికి అభ‌య‌మిస్తామ‌ని.. రైతాంగాన్ని ఆదుకుంటామ‌ని వైసీపీ నేత‌లు స్పష్టం చేశారు.

రాజ‌ధానిపై జీఎన్‌రావు క‌మిటీ ఇచ్చిన రిపోర్టును శిర‌సావ‌హిస్తామ‌న్నారు వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. ఒక ప్రాంతాన్ని అప్పు చేసి నిర్మించాల్సిన అవ‌స‌రం లేద‌ని… త‌క్కువ ఖ‌ర్చుతో రాజ‌ధానిని నిర్మించాల‌ని ప్రభుత్వం భావిస్తోంద‌న్నారు.

అమ‌రావ‌తిలో భూములిచ్చిన రైతులంద‌రినీ ఆదుకుంటామ‌న్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుంద‌ని.. కానీ లక్షల కోట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌న్నారు. రాష్ట్ర ప్రగ‌తి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌న్నారు. జీఎన్ రావు రిపోర్ట్‌ను అభివృద్ధిలో భాగ‌మ‌ని న‌మ్ముతున్నామ‌న్నారు.

తాజా ప‌రిస్థితుల‌పై చ‌ర్చించాం – పార్థ‌సార‌థి

తామంతా రాష్ట్రంలోని ప్రస్తుత తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించామ‌న్నారు ఉయ్యూరు ఎమ్మెల్యే పార్థసార‌థి. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల వ‌ల్లే రాజ‌ధాని మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లక్ష కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసి రాజధానిని నిర్మించే బదులు… అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచ‌న‌తో సీఎం జ‌గ‌న్ ముందుకెళ్తున్నార‌న్నారు.

అమ‌రావ‌తి ప్రాంత ప్రజ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తామ‌ని.. ఈ ప్రాంతాన్ని ఐటీ హ‌బ్ కేంద్రంగా, పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామ‌ని స్పష్టం చేశారు.

ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌డం లేదు – మ‌ల్లాది

అమరావతిలో రాజ‌ధాని నిర్మించాల‌ని ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ ఆర్థికంగా వీలుప‌డ‌డం లేద‌న్నారు విజ‌య‌వాడ సెంట్రల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు. ఒక కులమో లేక వ్యక్తుల‌ మీద కోపంతో ఇలా చేయడం లేద‌న్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయం గా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రభుత్వం రైతుల‌కు అండగా నిలుస్తుంద‌న్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసమే కమిటీ వేశామ‌ని విష్ణు చెప్పారు.

టీడీపీ నేత‌లు విశాఖలో ఒక మాట.. ఇక్కడ ఒక్కమాట మాట్లాడుతున్నార‌ని.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం గతంలోనూ కొంప ముంచింద‌ని విమ‌ర్శించారు. అమరావ‌తి రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల్లో…. నగర నిర్మాణం కోసం కమిటీ ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంద‌న్నారు.

First Published:  27 Dec 2019 2:30 AM IST
Next Story