Telugu Global
NEWS

టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్ 4వేల 70 ఎకరాలు " నివేదికల సమర్పణ

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు భారీగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కు పాల్పడినట్టు తేలింది. రాజధాని భూముల్లో అక్రమాలపై వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్, సీఐడీ, ఏసీబీలతో వేరు వేరుగా దర్యాప్తు బృందాలను నియమించింది. ఆ బృందాలు వేరు వేరుగా రాజధాని ప్రాంతాల్లో పర్యటించి భూములు కొన్న వారి వివరాలను సేకరించింది. రాజధాని ప్రకటనకు కొద్ది రోజుల ముందు టీడీపీ నేతలు భారీగా భూములు కొన్నట్టు దర్యాప్తులో తేలింది. దాదాపు ఆరు నెలల పాటు రహస్యంగా శోధన […]

టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్ 4వేల 70 ఎకరాలు  నివేదికల సమర్పణ
X

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు భారీగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కు పాల్పడినట్టు తేలింది. రాజధాని భూముల్లో అక్రమాలపై వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్, సీఐడీ, ఏసీబీలతో వేరు వేరుగా దర్యాప్తు బృందాలను నియమించింది.

ఆ బృందాలు వేరు వేరుగా రాజధాని ప్రాంతాల్లో పర్యటించి భూములు కొన్న వారి వివరాలను సేకరించింది. రాజధాని ప్రకటనకు కొద్ది రోజుల ముందు టీడీపీ నేతలు భారీగా భూములు కొన్నట్టు దర్యాప్తులో తేలింది. దాదాపు ఆరు నెలల పాటు రహస్యంగా శోధన చేసిన ప్రభుత్వ శాఖలు తమ నివేదికలను సమర్పించాయి.

టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి సన్నిహితులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ కీలక నేతలు, వారి బినామీలు నేరుగా భూములు కొన్నట్టు తేలింది. 2014 జూన్ 2 నుంచి రాజధాని ప్రకటన వెలువడిన 2014 డిసెంబర్ 30 వరకు భూములు కొన్న వారి వివరాలను సిద్ధం చేశారు.

వాటి ప్రకారం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అధికారిక ప్రకటన రావడానికి మధ్యలో టీడీపీ నేతలు ఏకంగా 4వేల 70 ఎకరాలను కొనుగోలు చేసినట్టు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ కొనుగోళ్లు అన్ని రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భాగంగా చేసినవిగానే భావిస్తున్నారు.

ఇలా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. అదే సమయంలో ప్రజలకు కూడా టీడీపీ నేతల బాగోతం అర్థమయ్యేలా… దర్యాప్తు సంస్థలు తేల్చిన టీడీపీ నేతల భూముల వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

First Published:  27 Dec 2019 3:55 AM IST
Next Story