Telugu Global
NEWS

మూడు రాజధానుల సంగతి ఇప్పట్లో లేనట్లే...

మూడు రాజధానుల అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. జీఎన్‌రావు కమిటీ నివేదికను పరిశీలించిన కేబినెట్‌ జనవరి మొదటి వారంలో బీసీజీ కమిటీ ఇచ్చే నివేదిక కోసం వేచిచూడాలని నిర్ణయించింది. బీసీజీ కమిటి నివేదిక రాగానే… ఆ నివేదికను జీఎన్‌ రావు నివేదికను రెండింటిని పరిశీలించి రాజధానులపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. జీఎన్‌రావు, బీసీజీ రిపోర్టులను పరిశీలించేందుకు ఒక హైపవర్ కమిటీని వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల […]

మూడు రాజధానుల సంగతి ఇప్పట్లో లేనట్లే...
X

మూడు రాజధానుల అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. జీఎన్‌రావు కమిటీ నివేదికను పరిశీలించిన కేబినెట్‌ జనవరి మొదటి వారంలో బీసీజీ కమిటీ ఇచ్చే నివేదిక కోసం వేచిచూడాలని నిర్ణయించింది. బీసీజీ కమిటి నివేదిక రాగానే… ఆ నివేదికను జీఎన్‌ రావు నివేదికను రెండింటిని పరిశీలించి రాజధానులపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

జీఎన్‌రావు, బీసీజీ రిపోర్టులను పరిశీలించేందుకు ఒక హైపవర్ కమిటీని వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశం ఇప్పుడు తేలే అవకాశం లేదు. జనవరి మొదటి వారంలో బీసీజీ కమిటీ రిపోర్టు వచ్చాక… ఇప్పటికే అందిన జీఎన్‌రావు రిపోర్టుతో కలిపి పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొన్ని నెలలు పట్టవచ్చు.

విశాఖ పరిపాలన రాజధాని అవుతుందంటూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపైనా పేర్నినాని స్పందించారు. విజయసాయిరెడ్డి వైసీపీ నాయకుడిగా, విశాఖ ఇన్‌చార్జ్‌గా ప్రకటన చేశారే గానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రకటన చేయలేదన్నారు. అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖలో ఉండవచ్చు అని మాత్రమే చెప్పారన్నారు. జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలను సంకలనం చేసి హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామన్నారు.

తమది కక్ష కట్టి వ్యవహరించే ప్రభుత్వం కాదని… కాబట్టి రాజధాని రైతులు ఆందోళన చెందవద్దని సమాచార శాఖ మంత్రి పేర్నినాని చెప్పారు. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం తోక ముడిచింది అనడానికి లేదన్నారు. ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం ధైర్యంగా చెప్పి చేస్తుందన్నారు.

First Published:  27 Dec 2019 10:47 AM IST
Next Story