Telugu Global
International

ఈ టీచర్ ఆలోచన.... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....

స్కూల్ పిల్లలకు పాఠాలు చేప్పడం కత్తిమీద సాము లాంటిది. మరీ ముఖ్యంగా జీవ శాస్త్రాన్ని బోధించడమంటే మరీను. స్పెయిన్ లో గత పదిహేనేళ్లుగా బయాలజీ పాఠాలు చెబుతున్న ఓ టీచర్… మానవ దేహ నిర్మాణాన్ని వివరించడానికి తానే ఒక టీచింగ్ అయిడ్ ని రూపొందించుకుంది. అదే ఆమెకు ఇప్పుడు ఖ్యాతిని తెచ్చిపెట్టింది. స్పెయిన్ కు చెందిన వెరోనికా డుకీ సైన్స్ టీచర్. పిల్లలకు సాధ్యమయినంత బాగా పాఠాలు చెప్పడానికి అవసరమయిన అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అందులో భాగంగానే […]

ఈ టీచర్ ఆలోచన.... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....
X

స్కూల్ పిల్లలకు పాఠాలు చేప్పడం కత్తిమీద సాము లాంటిది. మరీ ముఖ్యంగా జీవ శాస్త్రాన్ని బోధించడమంటే మరీను. స్పెయిన్ లో గత పదిహేనేళ్లుగా బయాలజీ పాఠాలు చెబుతున్న ఓ టీచర్… మానవ దేహ నిర్మాణాన్ని వివరించడానికి తానే ఒక టీచింగ్ అయిడ్ ని రూపొందించుకుంది. అదే ఆమెకు ఇప్పుడు ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

స్పెయిన్ కు చెందిన వెరోనికా డుకీ సైన్స్ టీచర్. పిల్లలకు సాధ్యమయినంత బాగా పాఠాలు చెప్పడానికి అవసరమయిన అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. అందులో భాగంగానే ఆమే అనాటమీ(మానవ శరీర నిర్మాణ శాస్త్రం)ని బోధించడానికి ఓ సూట్ ని రూపొందించుకుంది. ఈ పాఠాలు చాలా సున్నితంగా బోధించవలసి ఉంటుంది. తుంటరి పిల్లలుంటారు. తగిన సన్నద్ధత, సీరియస్నెస్ లేకపోతే టీచర్ అభాసుపాలు అవుతుంది. ఈ పాఠాలు చెప్పడం మహిళా టీచర్లకు చాలెంజ్ తో కూడిన వ్యవహారం. అందుకే తన అనుభవం తో ఈ అనాటమీ సూట్ ని తయారు చేయించింది.

ఆ రోజు పిల్లలు అంతా తరగతి గదిలో బయలాజీ టీచర్ కోసం ఎదురు చూస్తున్నారు… టీచర్ క్లాసులోకి అడుగు పెట్టింది. ఆమెను చూసి ఒక్కసారిగా పిల్లలంతా వణికిపోయారు. అందుకు కారణం ఆమె ధరించిన సూట్. సూట్ అంతా మానవ అవయవాలు నగ్నంగా కనిపించడం తో వారు భయపడ్డారు. ముందు భయపడినా ఆ తర్వాత పిల్లలు తేరుకున్నారు. శరీర నిర్మాణం గురించి టీచర్ చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటున్నారు.

అనాటమీ డ్రెస్ తో క్లాసులో ఆమె చెబుతున్న పాఠాలను ఫోటోలు తీసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దాదాపు 30 వేల మంది ఈ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. మరో లక్షకు పైగా నెటిజనులు ఫోటోలకు లైక్ కొట్టారు.

First Published:  27 Dec 2019 10:35 AM IST
Next Story