సినిమాల్లో నటించదట.. ఏకంగా సినిమాలే తీస్తుందట
మొన్నటివరకు హాట్ కామెంట్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో కొత్త అవతారం ఎత్తబోతోంది. త్వరలోనే నిర్మాతగా మారుతానంటోంది ఈమె. శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరిట ఓ కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తానని చెబుతోంది. యూట్యూబ్ లో లైవ్ ఇస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనాలు రేకెత్తించింది శ్రీరెడ్డి. ఆ తర్వాత ఫిలింఛాంబర్ ముందు అర్థనగ్నంగా నిరసన తెలిపి హాట్ టాపిక్ గా […]
మొన్నటివరకు హాట్ కామెంట్స్, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో కొత్త అవతారం ఎత్తబోతోంది. త్వరలోనే నిర్మాతగా మారుతానంటోంది ఈమె. శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరిట ఓ కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తానని చెబుతోంది. యూట్యూబ్ లో లైవ్ ఇస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది.
కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఒకప్పుడు టాలీవుడ్ లో సంచలనాలు రేకెత్తించింది శ్రీరెడ్డి. ఆ తర్వాత ఫిలింఛాంబర్ ముందు అర్థనగ్నంగా నిరసన తెలిపి హాట్ టాపిక్ గా మారింది. అప్పట్నుంచి ఆమెకు టాలీవుడ్ నుంచి నిరసన ఎదురైంది. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాంటి టైమ్ లో కోలీవుడ్ కు వెళ్లింది శ్రీరెడ్డి.
కోలీవుడ్ లో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. అదే టైమ్ లో కొన్ని తమిళ అవకాశాలు కూడా అందుకుంది. కాబట్టి ఆ కృతజ్ఞతతో తను పెట్టబోయే నిర్మాణ సంస్థలో తమిళ నటీనటులు, టెక్నీషియన్లకే ఎక్కువ అవకాశం ఇస్తానంటోంది శ్రీరెడ్డి. త్వరలోనే తన కొత్త సినిమా సంగతుల్ని వెల్లడిస్తానంటోంది. అంతా బాగానే ఉంది కానీ, శ్రీరెడ్డికి సినిమా తీసేంత డబ్బులు ఎక్కడివనేది ఇప్పుడు హాట్ టాపిక్.