Telugu Global
National

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ లేదు... వెనక్కి తగ్గిన అమిత్ షా

పార్లమెంట్ సాక్షిగా ఎన్నార్సీ ఉంటుందని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వెనక్కి తగ్గారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీపై ఇప్పుడు చర్చలు లేవని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఎన్నార్సీని తీసుకురావడానికి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే అంతకుముందు పార్లమెంటులో ఎన్నార్సీ తెస్తామని అమిత్ షా బల్లగుద్ది వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన మాటలను వెనక్కి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అమిత్ […]

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ లేదు... వెనక్కి తగ్గిన అమిత్ షా
X

పార్లమెంట్ సాక్షిగా ఎన్నార్సీ ఉంటుందని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వెనక్కి తగ్గారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీపై ఇప్పుడు చర్చలు లేవని తెలిపారు.

ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఎన్నార్సీని తీసుకురావడానికి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే అంతకుముందు పార్లమెంటులో ఎన్నార్సీ తెస్తామని అమిత్ షా బల్లగుద్ది వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన మాటలను వెనక్కి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

అమిత్ షా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్లో ఎన్నార్సీ అవసరం లేదు. ఎందుకంటే దీనిపై ప్రభుత్వం చర్చలు జరపలేదు. ప్రధాని మోడీ చెప్పిందిదే… దీనిపై కేబినెట్ లోనూ… పార్లమెంట్ లోనూ చర్చ జరగలేదు’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

ఇక ఇదే క్రమంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ)కి, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్సీఆర్)ల మధ్య ఎటువంటి సంబంధం లేదని.. స్పష్టం చేస్తున్నాను అంటూ అమిత్ షా వెనక్కితగ్గడం గమనార్హం.

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై భగ్గుమన్నారు. ఇప్పుడు ఎన్నార్సీపై కూడా ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈనేపథ్యంలోనే తొలిసారి అమిత్ షా ఎన్నార్సీపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

First Published:  26 Dec 2019 9:40 AM IST
Next Story