బాబుపై నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల ధిక్కారం.... రాత్రి భేటీ
విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టు ప్రతిపాదనను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం, అమరావతి రైతులతో ఉద్యమం చేయిస్తుండడంపై ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు లోలోన మథనపడుతున్నారు. చంద్రబాబు తన అమరావతి కోసం తమ రాజకీయ జీవితాలను పణంగా పెడుతున్నారని ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఆందోళన చెందుతున్నారు. రెండు మండలాలకు నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, […]
విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టు ప్రతిపాదనను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం, అమరావతి రైతులతో ఉద్యమం చేయిస్తుండడంపై ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు లోలోన మథనపడుతున్నారు.
చంద్రబాబు తన అమరావతి కోసం తమ రాజకీయ జీవితాలను పణంగా పెడుతున్నారని ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు
ఆందోళన చెందుతున్నారు. రెండు మండలాలకు నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ, గణబాబులు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, చలపతిరావు, నాగజగదేశ్వరరావులు ఒక హోటల్‌లో సమావేశం అయ్యారు. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఆ సమావేశానికి హజరయ్యారు. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఈ సమావేశం జరిగింది.
విశాఖను పరిపాలన రాజధానిని చేయాలన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని సమావేశంలో నిర్ణయించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకించడంపై సమావేశంలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా సమర్ధించేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. తీర్మానం చేసి అధినేతకు అందజేయాలని నిర్ణయించారు.