Telugu Global
NEWS

ట్రైనీ ఐపీఎస్ మ‌హేశ్వ‌ర్‌రెడ్డి స‌స్పెన్ష‌న్ ర‌ద్దు

ట్రైనీ ఐపీఎస్ మ‌హేశ్వ‌ర్‌రెడ్డి స‌స్పెన్ష‌న్‌ను ర‌ద్దు చేస్తూ క్యాట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హేశ్వ‌ర్‌రెడ్డిని ఐపీఎస్ శిక్ష‌ణ‌కు అనుమ‌తించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది క్యాట్‌. తుది ఉత్త‌ర్వుల‌కు లోబ‌డి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి నియామ‌కం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌హేశ్వ‌ర్‌రెడ్డి త‌న‌ని పెళ్లి చేసుకున్నార‌ని… ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భావ‌న అనే మ‌హిళ ఫిర్యాదు చేసింది. మ‌హేశ్వ‌ర్‌రెడ్డి త‌న‌ను వేధిస్తున్నాడ‌ని.. విడాకులివ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నాడ‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది భావ‌న‌. ఐపీఎస్‌గా ఎంపికైనప్ప‌టి నుంచి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని.. వేరే […]

ట్రైనీ ఐపీఎస్ మ‌హేశ్వ‌ర్‌రెడ్డి స‌స్పెన్ష‌న్ ర‌ద్దు
X

ట్రైనీ ఐపీఎస్ మ‌హేశ్వ‌ర్‌రెడ్డి స‌స్పెన్ష‌న్‌ను ర‌ద్దు చేస్తూ క్యాట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హేశ్వ‌ర్‌రెడ్డిని ఐపీఎస్ శిక్ష‌ణ‌కు అనుమ‌తించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది క్యాట్‌. తుది ఉత్త‌ర్వుల‌కు లోబ‌డి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి నియామ‌కం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

మ‌హేశ్వ‌ర్‌రెడ్డి త‌న‌ని పెళ్లి చేసుకున్నార‌ని… ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భావ‌న అనే మ‌హిళ ఫిర్యాదు చేసింది. మ‌హేశ్వ‌ర్‌రెడ్డి త‌న‌ను వేధిస్తున్నాడ‌ని.. విడాకులివ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నాడ‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది భావ‌న‌.

ఐపీఎస్‌గా ఎంపికైనప్ప‌టి నుంచి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని.. వేరే పెళ్లి చేసుకొనేందుకు సిద్ధ‌ప‌డుతున్నాడ‌ని భావ‌న ఆరోపిస్తోంది. ఎలాగైనా వ‌దిలించుకోవాల‌న్న ఆలోచ‌న‌తో త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడ‌ని భావ‌న పేర్కొంటోంది.

భావ‌న ఫిర్యాదుతో రాచ‌కొండ పోలీస్‌స్టేష‌న్‌లో మ‌హేశ్వ‌ర్‌రెడ్డిపై వ‌ర‌క‌ట్న వేధింపుల కింద కేసు సైతం న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ‌ మ‌హేశ్వ‌ర్‌రెడ్డిని ఐపీఎస్ ట్రైనింగ్ నుంచి త‌ప్పిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో మ‌హేశ్వ‌ర్‌రెడ్డి క్యాట్‌ను ఆశ్ర‌యించారు. మ‌హేశ్వ‌ర్‌రెడ్డి స‌స్పెన్ష‌న్‌ను ర‌ద్దు చేస్తూ క్యాట్ ఆదేశాలిచ్చింది. ఐపీఎస్ ట్రైనింగ్ ముగిసిన త‌ర్వాత ఆయ‌న కేసుపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది.

First Published:  25 Dec 2019 12:32 AM IST
Next Story