రూలర్ ఫ్లాప్ అయింది.. బోయపాటికి దెబ్బ పడింది
ఏదైతే జరగకూడదని బోయపాటి భావించాడో అదే జరిగింది. ఈ దర్శకుడు భయపడినంత అయింది. రూలర్ ఫ్లాప్ అవ్వకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకున్నాడు బోయపాటి. ఎందుకంటే, అది ఫ్లాప్ అయితే ఆ ప్రభావం కచ్చితంగా బాలయ్యతో చేయబోయే తన నెక్ట్స్ సినిమాపై పడుతుంది. బడ్జెట్ కోతలు తప్పనిసరి. ఇప్పుడదే జరిగింది. బోయపాటి-బాలయ్య సినిమా కోసం ఇంతకుముందు అనుకున్న బడ్జెట్ కు నో చెబుతున్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. రూలర్ విడుదలకు ముందు బోయపాటి-బాలయ్య సినిమా కోసం అక్షరాలా […]
ఏదైతే జరగకూడదని బోయపాటి భావించాడో అదే జరిగింది. ఈ దర్శకుడు భయపడినంత అయింది. రూలర్ ఫ్లాప్ అవ్వకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకున్నాడు బోయపాటి. ఎందుకంటే, అది ఫ్లాప్ అయితే ఆ ప్రభావం కచ్చితంగా బాలయ్యతో చేయబోయే తన నెక్ట్స్ సినిమాపై పడుతుంది. బడ్జెట్ కోతలు తప్పనిసరి. ఇప్పుడదే జరిగింది.
బోయపాటి-బాలయ్య సినిమా కోసం ఇంతకుముందు అనుకున్న బడ్జెట్ కు నో చెబుతున్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. రూలర్ విడుదలకు ముందు బోయపాటి-బాలయ్య సినిమా కోసం అక్షరాలా 60 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు. అప్పట్లో ఈ బడ్జెట్ పై మీడియా పెదవి విరిచింది కూడా. కానీ బోయపాటి ఇంతే అనుకొని సరిపెట్టుకుంది.
కట్ చేస్తే, రూలర్ డిజాస్టర్ అయింది. దీంతో మిర్యాల రవీందర్ రెడ్డి డైలమాలో పడ్డాడు. 60కోట్లు పెట్టి బాలయ్యతో సినిమా చేయడం ఎంత రిస్క్ అవుతుందో అర్థం చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు బడ్జెట్ ను అమాంతం 20 కోట్లు తగ్గించేశాడు. 40కోట్లలో సినిమా చేస్తే ఓకే, లేకపోతే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానంటున్నాడు.
ఇలాంటి బడ్జెట్ లెక్కలకు బాలయ్య ఎలాగూ దూరం. ఇప్పుడు తేల్చాల్సింది బోయపాటి మాత్రమే. మరి బోయపాటి 40కోట్లలో సినిమా తీస్తాడా లేక మరో నిర్మాతను వెదుక్కుంటాడా అనేది చూడాలి.