పప్పూ... నీది సార్ధక నామధేయం
నేషనల్ రిజిస్ట్రార్ సిటిజన్స్ (ఎన్నార్సీ)కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఎందుకు ఇవ్వడం లేదో.. దాని వెనుక కారణం తెలపాలంటూ తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు ఆరోపణలు గుప్పించారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని.. అందుకే రాజ్యసభలో ఎన్నార్సీకి మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు. పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ […]
నేషనల్ రిజిస్ట్రార్ సిటిజన్స్ (ఎన్నార్సీ)కు ఏపీ సీఎం జగన్ మద్దతు ఎందుకు ఇవ్వడం లేదో.. దాని వెనుక కారణం తెలపాలంటూ తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు ఆరోపణలు గుప్పించారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని.. అందుకే రాజ్యసభలో ఎన్నార్సీకి మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు.
పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్మీట్లలో ఫ్రస్టేట్ అవుతున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 25, 2019
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ ను కడిగిపారేశారు. ‘‘పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజూ ప్రెస్ మీట్ లో ఫ్రస్టేట్ అవుతున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.
ఇక టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపైనా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించి తూర్పు ప్రజలకు ఆగ్రహం తెప్పించవద్దు యనమల గారూ…. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించి తూర్పు ప్రజలకు ఆగ్రహం తెప్పించొద్దు యనమల గారూ. మిమ్మల్ని తుని ప్రజలు తరిమేశారన్న అక్కసుతో వైజాగ్ వద్దని రంకెలేయడం న్యాయం కాదు. అయినా దీనికి మీ అనుమతి అవసరం లేదు. ప్రజల ఆశీస్సులున్నాయి సిఎం జగన్ గారికి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 25, 2019
మిమ్మల్ని తుని ప్రజలు తరిమేశారన్న అక్కసుతో వైజాగ్ వద్దని రంకెలేయడం న్యాయం కాదని కౌంటర్ ఇచ్చారు. దీనికి మీ అనుమతి అవసరం లేదని.. ప్రజల ఆశీస్సులు జగన్ కు ఉన్నాయని గుర్తుంచుకోండని హితవు పలికారు.