డిసెంబర్ 27.... జగన్ వైపే అందరి చూపు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని సీఎం జగన్ చేసిన ప్రకటన.. దానికి అనుకూలంగా జీఎన్ రావు కమిటీ సిఫార్సులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు జగన్ చేసిన ప్రకటనతో సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలు, ప్రాంతాలనే కాదు.. జగన్ చేసిన ప్రకటన రాజకీయ పార్టీలను కూడా గందరగోళంలోకి నెట్టేసింది. టీడీపీ, బీజేపీ అగ్ర నాయకులు సైతం తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా మద్దతుగా మాట్లాడి విభజించబడ్డారు. ఇవే కాదు వామపక్ష […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని సీఎం జగన్ చేసిన ప్రకటన.. దానికి అనుకూలంగా జీఎన్ రావు కమిటీ సిఫార్సులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అయితే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు జగన్ చేసిన ప్రకటనతో సంబరాలు జరుపుకుంటున్నారు.
ప్రజలు, ప్రాంతాలనే కాదు.. జగన్ చేసిన ప్రకటన రాజకీయ పార్టీలను కూడా గందరగోళంలోకి నెట్టేసింది. టీడీపీ, బీజేపీ అగ్ర నాయకులు సైతం తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా మద్దతుగా మాట్లాడి విభజించబడ్డారు.
ఇవే కాదు వామపక్ష సీపీఐ, సీపీఎం నాయకత్వాలు కూడా ఈ ప్రకటనతో ఇబ్బందుల్లో పడ్డాయి. సీపీఐ వ్యతిరేకించగా.. సీపీఎం ఇంకా స్పందించలేదు. మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఇప్పుడు జగన్ చేసిన ప్రకటనపై కక్కలేక మింగలేక మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే జగన్ మరో సంచలన నిర్ణయానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 27న కేబినెట్ సమావేశంలో ఏపీకి రాజధానులపై అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు.
మరి అమరావతికి వ్యతిరేకంగా రాబోతున్న జగన్ కేబినెట్ నిర్ణయంపై ఎలాంటి ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతాయో వేచిచూడాల్సిందే. రాజకీయ శక్తుల పునరేకీకరణకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో వారంతా జగన్ ప్రకటనపై ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.