Telugu Global
NEWS

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతోందా?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ అధికార టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు సై అంటే సై అంటున్నాయి. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం మున్సిపల్ యుద్ధానికి తాము సిద్దంగా లేమని అస్త్ర సన్యాసం చేయడం… రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఆకస్మికంగా రావడంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. హైకోర్టులో పిటీషన్ వేసింది. ఆపాలని ఈసీని కోరింది. హుజూర్ నగర్ ఓటమి నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదు. ఆర్టీసీ సమ్మె…. కేసీఆర్ పై […]

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతోందా?
X

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ అధికార టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు సై అంటే సై అంటున్నాయి. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం మున్సిపల్ యుద్ధానికి తాము సిద్దంగా లేమని అస్త్ర సన్యాసం చేయడం… రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఆకస్మికంగా రావడంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. హైకోర్టులో పిటీషన్ వేసింది. ఆపాలని ఈసీని కోరింది.

హుజూర్ నగర్ ఓటమి నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదు. ఆర్టీసీ సమ్మె…. కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న కాలంలోనే ఏకంగా పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహించిన సీటును కోల్పోవడం కాంగ్రెస్ నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టుంది.

తాజాగా ఈ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడి కోర్టులకు వెళుతోందని… తాము ప్రజల వద్దకు వెళుతున్నామని కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం నిరాశలో మునిగిపోయారు. మున్సిపల్ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోలేకనే అస్త్ర సన్యాసం చేస్తున్నారని.. మున్సిపల్ ఎన్నికలు ఆపాలంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారని…. ఆఫ్ ది రికార్డ్ గా వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  25 Dec 2019 11:47 AM IST
Next Story