Telugu Global
Cinema & Entertainment

అర్జున్ రెడ్డి దర్శకుడితో ప్రభాస్

బాహుబలితో దేశవ్యాప్తంగా స్టార్ అనిపించుకున్న ప్రభాస్, సాహో సినిమాతో బాలీవుడ్ లో మరో సక్సెస్ కొట్టాడు. ఈ దెబ్బతో ఇతడు పాన్-ఇండియా స్టార్ అయిపోయాడు. ఇతడి క్రేజ్ మామూలుగా లేదని తాజాగా ఫోర్బ్స్ జాబితా కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో, తన సినిమాలన్నింటికీ పాన్-ఇండియా అప్పీల్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు ప్రభాస్. దర్శకుల్ని కూడా అలాంటివాళ్లనే సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి వంగకు అవకాశం ఇచ్చాడు ప్రభాస్. అవును.. త్వరలోనే ఈ అర్జున్ రెడ్డి దర్శకుడితో […]

అర్జున్ రెడ్డి దర్శకుడితో ప్రభాస్
X

బాహుబలితో దేశవ్యాప్తంగా స్టార్ అనిపించుకున్న ప్రభాస్, సాహో సినిమాతో బాలీవుడ్ లో మరో సక్సెస్ కొట్టాడు. ఈ దెబ్బతో ఇతడు పాన్-ఇండియా స్టార్ అయిపోయాడు. ఇతడి క్రేజ్ మామూలుగా లేదని తాజాగా ఫోర్బ్స్ జాబితా కూడా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో, తన సినిమాలన్నింటికీ పాన్-ఇండియా అప్పీల్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు ప్రభాస్. దర్శకుల్ని
కూడా అలాంటివాళ్లనే సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి వంగకు అవకాశం ఇచ్చాడు ప్రభాస్.

అవును.. త్వరలోనే ఈ అర్జున్ రెడ్డి దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు రెబల్ స్టార్. ఈ మేరకు కథాచర్చలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ‘జాన్’ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మరో 4 నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ వెంటనే సందీప్ రెడ్డి సినిమా మొదలవుతుంది.

బాలీవుడ్ లో కూడా సందీప్ రెడ్డికి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ అనే సినిమా తీస్తే, ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది అది. దీనికితోడు బాలీవుడ్ మీడియాలో హేమాహేమీలు అనదగ్గ వ్యక్తులతో పెట్టుకొని, హాట్ టాపిక్ గా కూడా మారాడు. ఇలాంటి వ్యక్తితో సినిమా చేస్తే, ఆ మూవీకి కచ్చితంగా బాలీవుడ్ లో కూడా రీచ్ ఉంటుంది. అందుకే ప్రభాస్ ఇతడ్ని సెలక్ట్ చేసుకున్నాడు.

First Published:  24 Dec 2019 4:53 PM IST
Next Story