చివరాఖరి అవకాశం కూడా పాయె!
శుక్రవారం రిలీజైన రూలర్ సినిమాకు మొదటి ఆటకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. బాలయ్య ఇక మారడని అంతా ఫిక్స్ అయిపోయారు. శనివారానికి నెగెటివ్ టాక్ కాస్తా డిజాస్టర్ టాక్ గా మారిపోయింది. ఓవైపు ఇంత జరుగుతున్నా, మరోవైపు యూనిట్ లో ఆశ మాత్రం చావలేదు. తమ సినిమా లేస్తుందని వాళ్లు చాలా ఎదురుచూశారు. ఇప్పుడా ఎదురుచూపులకు సోమవారం నాటి వసూళ్లు ఫుల్ స్టాప్ పెట్టేశాయి. రూలర్ సినిమా పూర్తిగా చతికిలపడిపోయిందనే విషయాన్ని సోమవారం వసూళ్లు తేల్చిపడేశాయి. సోమవారం […]
శుక్రవారం రిలీజైన రూలర్ సినిమాకు మొదటి ఆటకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. బాలయ్య ఇక మారడని అంతా ఫిక్స్ అయిపోయారు. శనివారానికి నెగెటివ్ టాక్ కాస్తా డిజాస్టర్ టాక్ గా మారిపోయింది. ఓవైపు ఇంత జరుగుతున్నా, మరోవైపు యూనిట్ లో ఆశ మాత్రం చావలేదు. తమ సినిమా లేస్తుందని వాళ్లు చాలా ఎదురుచూశారు. ఇప్పుడా ఎదురుచూపులకు సోమవారం నాటి వసూళ్లు ఫుల్ స్టాప్ పెట్టేశాయి.
రూలర్ సినిమా పూర్తిగా చతికిలపడిపోయిందనే విషయాన్ని సోమవారం వసూళ్లు తేల్చిపడేశాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 65 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో సినిమా ఇక నడవదని అందరికీ అర్థమైపోయింది. మొదటి రోజు 4 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకి అమాంతం పడిపోయింది. కేవలం 93 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక మూడో రోజు మరింత పడిపోయి, ఫస్ట్ వీకెండ్ కు కేవలం 5 కోట్ల 88 లక్షల రూపాయల షేర్ మాత్రమే రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 21 కోట్ల రూపాయలకు అమ్మారు. మరో వారం రోజుల్లో ఫైనల్ రన్ పూర్తవుతుందను కున్నప్పటికీ సినిమా 8 కోట్ల మార్క్ కూడా టచ్ చేయదని తేలిపోయింది.
దీంతో బయ్యర్లకు దాదాపు 13-15 కోట్ల రూపాయల నష్టం వాటిల్లడం గ్యారెంటీ అని తేలిపోయింది. అటు యూనిట్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా, సినిమా సక్సెస్ మీట్ పెట్టి అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.