కొరియా కోచ్ పై సింధు తండ్రి గరంగరం
కోచ్ కిమ్ అనారోగ్యాన్ని పట్టించుకోని సింధు కూతురి వైఫల్యాలను జీర్ణించుకోలేకపోతున్న రమణ ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస పరాజయాలను ఆమె తండ్రి రమణ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. వ్యక్తిగత కోచ్, కొరియా మాజీ ప్లేయర్ కిమ్ జీ హ్యున్ తోడుగా లేకపోతే తన కుమార్తె ఇక విజయాలు సాధించలేదన్నట్లుగా రమణ మాట్లాడుతున్నారు. మరోవైపు…కిమ్ మాత్రం తనపట్ల సింధు, ఆమె కుటుంబసభ్యుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కొరియాలోని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన […]
- కోచ్ కిమ్ అనారోగ్యాన్ని పట్టించుకోని సింధు
- కూతురి వైఫల్యాలను జీర్ణించుకోలేకపోతున్న రమణ
ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస పరాజయాలను ఆమె తండ్రి రమణ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.
వ్యక్తిగత కోచ్, కొరియా మాజీ ప్లేయర్ కిమ్ జీ హ్యున్ తోడుగా లేకపోతే తన కుమార్తె ఇక విజయాలు సాధించలేదన్నట్లుగా రమణ మాట్లాడుతున్నారు.
మరోవైపు…కిమ్ మాత్రం తనపట్ల సింధు, ఆమె కుటుంబసభ్యుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కొరియాలోని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
తాను తీవ్ర అనారోగ్యం పాలై ఇంటికే పరిమితమై ఉంటే…సింధుకానీ, ఆమె తండ్రి కానీ ..కనీసం ఒక్కసారి కూడా ఫోను చేసి తనను పలకరించలేదని, తన యోగక్షేమాలు కనుక్కోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆమె అనారోగ్యం మాకెల తెలుస్తుంది – రమణ
సింధు వ్యక్తిగత కోచ్ కిమ్ అనారోగ్యం సంగతి తమకు తెలియదని, ఓసారి ఫోన్ చేస్తే స్నేహితుల ఇంట్లో ఉన్నానంటూ బదులిచ్చిందని… అయినా ..కిమ్ అనారోగ్యం సంగతి తమకు ఎలా తెలుస్తుందని రమణ బదులిచ్చారు.
సింధు ప్రపంచ చాంపియన్ గా నిలవడానికి కిమ్ శిక్షణే కారణమని, ఆ విషయాన్ని సింధు పలుమార్లు చెప్పిందన్న వాస్తవాన్ని అందరూ గుర్తుంచకోవాలని రమణ అంటున్నారు.
సింధు ప్రపంచ టైటిల్ విజయం తర్వాతే తనకు తగిన గుర్తింపు వచ్చిందని, తానెవరో ప్రపంచానికి తెలిసిందంటూ ప్రచారం చేయటం పట్ల కిమ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తన భర్తకు అనారోగ్యంగా ఉందంటూ సింధు వ్యక్తిగత కోచ్ పదవికి రాజీనామా చేసిన కిమ్…ప్రస్తుతం మరో అకాడమీలో శిక్షకురాలిగాచేరింది.
బాసెల్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ లో టైటిల్ నెగ్గిన సింధు…ఆ తర్వాత ఆడిన ఆరు ప్రధాన టోర్నీల ప్రారంభ రౌండ్లలోనే పరాజయాలు పొందడం ద్వారా 15వ ర్యాంక్ కు దిగజారిపోయింది. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం కూడా అనుమానంగా మారింది.