మిస్టరీగా మారిన బుల్లెట్... పోలీసులకు కొత్త సవాల్ !
పోలీసులకు సవాల్‌గా మారిన పాతబస్తీ మహిళ శరీరంలోని బుల్లెట్ కేసులో…. పలు సంచలనాలు బయట పడుతున్నాయి. అస్మాను తండ్రే రెండేళ్ల క్రితం నాటు తుపాకీతో కాల్చినట్టు పోలీసులు అనుమానించిన కొన్ని గంటల్లోనే మరో ట్విస్ట్ బయటకొచ్చింది. అయితే.. వాచ్‌మెన్‌గా పని చేసే అస్మా తండ్రి యజమాని గన్‌ను ఇంట్లో తెచ్చి దాచినట్టు తెలుస్తోంది. అయితే ఆ గన్‌తోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసుల అనుమానం. అయితే ఆ గన్‌తో కాల్చింది ఎవరు అన్నది మాత్రం మిస్టరీగానే ఉంది. […]
పోలీసులకు సవాల్‌గా మారిన పాతబస్తీ మహిళ శరీరంలోని బుల్లెట్ కేసులో…. పలు సంచలనాలు బయట పడుతున్నాయి. అస్మాను తండ్రే రెండేళ్ల క్రితం నాటు తుపాకీతో కాల్చినట్టు పోలీసులు అనుమానించిన కొన్ని గంటల్లోనే మరో ట్విస్ట్ బయటకొచ్చింది.
అయితే.. వాచ్‌మెన్‌గా పని చేసే అస్మా తండ్రి యజమాని గన్‌ను ఇంట్లో తెచ్చి దాచినట్టు తెలుస్తోంది. అయితే ఆ గన్‌తోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసుల అనుమానం. అయితే ఆ గన్‌తో కాల్చింది ఎవరు అన్నది మాత్రం మిస్టరీగానే ఉంది.
అయితే.. ఆ తర్వాత బుల్లెట్ గాయం అయినప్పుడు నాటు వైద్యం చేసినట్టు నిజాలు బయటకు వస్తున్నాయి. ఆయుర్వేద వైద్యంతో బ్లడ్ బ్లీడింగ్, నొప్పి తగ్గించుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో మరింత సమాచారం కోసం అస్మా బేగమ్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. అటు అస్మా ఫోన్‌ను సీజ్ చేసి కాల్ రికార్డ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
సంచలనంగా మారిన ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇంతకు బాడీలోకి బుల్లెట్ ఎలా వెళ్లింది? ఎలాంటి కాల్పుల ఘటన జరుగలేదని ముందుగా బాధిత కుటుంబం చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం ఉంది? అయినా బాడీలోకి బుల్లెట్ ఎలా వచ్చింది? ఇంతటి సంచలన నిజాన్ని ఇన్నాళ్లు బయటకి పొక్కకుండా ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? ఇలాంటి కోణాలను వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తును లోతుగా చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు మాత్రం ముందు బుల్లెట్ ఎలా వచ్చిందో తెలియదన్నారు. అసలు ఎలాంటి కాల్పులు లేవన్నారు.. ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. అయినా అస్మా వెన్నులో బుల్లెట్ బయట పడింది. బాధితుల అనుమానాలు, అంచనాలు తప్పాయి. స్కానింగ్‌లో బయట పడ్డ తూటాను నిమ్స్ వైద్యులు బయటకు తీశారు. దీన్ని పోలీసులు సవాల్‌గా తీసుకొని తీగ లాగితే డొంక కదిలినట్టుగా… కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ నిజాలు బాధిత కుటుంబానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. నిమ్స్‌లో సర్జరీ చేసి బుల్లెట్ ను బయటకు తీసిన వైద్యులు.. పేషెంట్‌ను మరునాడే డిశ్చార్జీ చేశారు.
నిమ్స్ వైద్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… బుల్లెట్ శరీరంలోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని…. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తమకు చెప్పలేదని డాక్టర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.
శరీరంలోకి బుల్లెట్ ఉందన్న విషయం తెలిశాక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో జరిగిన గొడవల వల్ల కాల్పులు జరిగాయా? లేదా మరో కావాల్సిన వ్యక్తి కాల్చాడా?… కేసు బయటకు వస్తే పరువు పోతుందని అనుకున్నారా? ఇన్నాళ్లు ఈ కేసును దాయడంలో దాగి ఉన్న మర్మం ఏమిటి? అన్న కోణంలో కేసును విచారిస్తున్నారు.