అమరావతి రాజధాని కావాలని రైతులు అడగలేదు....
ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను చేసిన దగ్గర నుంచి అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమాలు మొదలయ్యాయి. రైతులమని చెప్పుకునే చాలా మంది రాజధాని తరలించవద్దని ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో నర్సారావుపేట ఎంపీ, వైసీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పందించారు. అమరావతిలో రాజధాని కావాలని గతంలో రైతులెవరూ అడగలేదని.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రాజధాని కడతామని మభ్యపెట్టడంతోనే స్వచ్ఛందంగా భూములిచ్చారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కోసం […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను చేసిన దగ్గర నుంచి అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమాలు మొదలయ్యాయి. రైతులమని చెప్పుకునే చాలా మంది రాజధాని తరలించవద్దని ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో నర్సారావుపేట ఎంపీ, వైసీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పందించారు.
అమరావతిలో రాజధాని కావాలని గతంలో రైతులెవరూ అడగలేదని.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రాజధాని కడతామని మభ్యపెట్టడంతోనే స్వచ్ఛందంగా భూములిచ్చారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన నిజమైన రైతులెవరికీ వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేయదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర రాజధానిని ఎక్కడ నిర్మిస్తున్నారనే దానికంటే.. భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలన్నదే వైసీపీ ప్రధాన ఎజెండా అని అన్నారు. అమరావతి ప్రాంత రైతులకు సీఎం జగన్ తప్పక న్యాయం చేస్తారని ఆయన చెప్పారు.