జనాభా లెక్కల కోసం యాప్... 13 వేల కోట్లు కేటాయింపు !
జనాభా లెక్కలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కల సేకరణను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 31 వరకు జనాభా లెక్కలను సేకరిస్తారు. జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ‘పేపర్ లెస్’ జనగణనకు కేంద్రం సంకల్పించింది. ఈ యాప్ ద్వారా లెక్కలను సేకరిస్తారు. ప్రతి పౌరుడికి చెందిన సమగ్ర గుర్తింపు డేటాబెస్‌ను తయారు చేయాలని టార్గెట్‌గా… నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ కేంద్రం నిర్ణయం […]
జనాభా లెక్కలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కల సేకరణను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 31 వరకు జనాభా లెక్కలను సేకరిస్తారు. జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ‘పేపర్ లెస్’ జనగణనకు కేంద్రం సంకల్పించింది.
ఈ యాప్ ద్వారా లెక్కలను సేకరిస్తారు. ప్రతి పౌరుడికి చెందిన సమగ్ర గుర్తింపు డేటాబెస్‌ను తయారు చేయాలని టార్గెట్‌గా… నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని ప్రతి సాధారణ పౌరుడు ఈ ఎన్‌పీఆర్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
జనాభా లెక్కల సేకరణ కోసం 13వేల కోట్ల రూపాయలను కేటాయించారు. జనాభా లెక్కల సేకరించే క్రమంలో ఎలాంటి పత్రాలు, బయోమెట్రిక్ ఇచ్చే అవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది. సెల్ప్ డిక్లరేషన్ ప్రక్రియతో జనాభా లెక్కల సేకరణ ఉంటుందని తెలిపింది.
జనగణనకు రూ.8754.23 కోట్లు, జనాభా లెక్కల రిజిస్టర్‌లో వివరాల నమోదుకు రూ.3941.35 కోట్లు కేటాయించారు. జనాభా లెక్కింపు బ్రిటిష్ కాలం నుంచి జరుగుతున్నదని…దీనిపై ఎలాంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ చెప్పారు.
2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి ఎన్‌పీఆర్ డేటా సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే నిర్వహించి తొలి అప్‌డేషన్ చేశారు. ఆ తర్వాత డేటా డిజిటలైజేషన్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఈ ఎన్‌పీఆర్‌ను 2021 జనగణనతో అప్‌డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య అసోం మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్‌పీఆర్ ప్రక్రియ చేపట్టనుంది. అసోంలో ఇటీవలే జాతీయ పౌర రిజిస్టర్ నమోదు చేపట్టినందున ఆ రాష్ట్రాన్ని మినహాయించారు.
ఇటు కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అటల్ భూజల యోజన పథకానికి 6వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఈ పథకం కింద గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లకు ప్రయోజనం చేకూరనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఆరు వేల కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది.
ఆయుధాల చట్టంలో కూడా కేంద్రం సవరణలు చేసింది. ఇకపై రెండు లైసెన్స్‌లు కలిగి ఉండవచ్చని పేర్కొంది. త్రివిధ దళాలకు ఉమ్మడి చీఫ్ నియామకానికి కేంద్రం కేబినెట్ పచ్చజెండా ఊపింది. 4 స్టార్లు కలిగిన జనరల్ ర్యాంకు అధికారి మిలటరీ ఎఫైర్స్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఈ విభాగం కింద ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు పనిచేస్తాయి. రక్షణ శాఖలో సమన్వయం కోసం ఈ పదవి క్రియేట్ చేస్తున్నట్లు ఆగస్ట్ 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.